English   

రవితేజ, శ్రీను వైట్ల కన్ఫార్మ్ చేశారండోయ్..?

Amar-Akbar-Anthony
2018-10-31 11:19:58

మాస్ మహరాజ్ రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. రవితేజ త్రిపాత్రాభినయం చేస్తోన్న సినిమా ఇది. కానీ ఒక్కడే మూడు పాత్రల్లో  కనిపిస్తాడు అనేవాళ్లూ ఉన్నారు. రీసెంట్ గా వచ్చిన టీజర్ ప్రామిసింగ్ గా కనిపిచింది. కానీ ఈ కాంబినేషన్ పై ఆడియన్స్ సంగతేమో కానీ.. డిస్ట్రిబ్యూటర్స్ లో పెద్దగా క్రేజ్ లేదనేది నిజం. అందుకే మరో ట్రైలర్ కానీ.. లేదా ఇంకేదైనా మ్యాజికల్ మూమెంట్ కానీ చూపించాల్సి ఉంటుంది.. మొత్తంగా హీరో, దర్శకుడు ఇద్దరూ వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. అందుకే కాస్త కసిగా వస్తున్నట్టు తెలుస్తోంది. పైగా వీరిది ఇంతకు ముందు హిలేరియస్ అండ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. అందువల్ల ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ కు ఢోకా ఉండదనుకోవచ్చు. ఇక ఈ మూవీతో గోవా కోవా ఇలియానా టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తోంది. టీజర్ లో తన లుక్ కూడా బావుంది.  

ఇక ఈమూవీకి సంబంధించి రిలీజ్ డేట్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉండేది. టీజర్ లో కూడా విషయం చెప్పకపోయేసరికి వాళ్లు చెప్పినట్టు నవంబర్  లో విడుదలవుతుందా అనే డౌట్స్ కూడా వచ్చాయి. బట్ లేటెస్ట్ గా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ మూవీని నవంబర్ 16న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. మైత్రీ మూవీస్ నుంచి సినిమా అంటే మాగ్జిమం గ్యారెంటీ అనే ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ ను నిలుపుకుంటే.. శ్రీను వైట్ల, రవితేజ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టే.. మరి వీళ్లు టీజర్ లో చెప్పినట్టు.. వారిలోని బలమే వారిని ఆదుకుంటుందేమో చూడాలి.

More Related Stories