English   

మురుగదాస్ భలే జాదూలే..?

Murugadoss-Varun
2018-10-31 11:41:46

లేదు లేదంటూనే కథను కొట్టేసిన విషయం ఒప్పుకున్నాడు. కాదు కాదంటూనే క్రెడిట్ కూడా ఇవ్వబోతున్నాడు. ముందు నుంచీ కథలు కొట్టేయడంలో మురుగదాస్ మాస్టర్ అని అందరికీ తెలుసు. మనోడికి ఈ అలవాటు గజిని సినిమా నుంచీ ఉంది. అదృష్టం కొద్దీ సినిమాలు హిట్ అవుతున్నాయి కాబట్టి పెద్దగా పట్టించుుకోవడం లేదు. కానీ మనోడు సొంతంగా పెన్ పట్టి రాసిన రెండు కథలూ ఆడలేదు. ఆశ్చర్యంగా ఆ రెండు సినిమాలూ తెలుగువారితోనే చేశాడీ దర్శకుడు.మెగాస్టార్ తో చేసిన ‘స్టాలిన్’ తో పాటు రీసెంట్ గా వచ్చిన ‘స్పైడర్’ ఈ రెండు కథలు మాత్రం ఆయనే రాసుకున్నాడట. ఇది చాలదూ ఆ పెన్ లో ఎంత పవర్ ఉందో తెలియడానికి. మొత్తంగా కత్తి సినిమమా కూడా తెలుగు రచయిత నర్సింహారావు నుంచి కాపీ కొట్టాడు. ఇప్పుడు సర్కార్ విషయంలోనూ అంతే. ఓ తమిళ రచయిత నుంచి కాపీ కొట్టాడు. ఆ వ్యక్తి ఈ కథ తనదని.. సౌత్ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్ లో కంప్లైంట్ చేయడమే కాక.. కోర్ట్ లో కేస్ కూడా వేశాడు. దీంతో మొదట్లో ఈ కథ తనదని బుకాయించినా.. ఫైనల్ గా ఒప్పుకున్నాడు మురుగదాస్.

తనపై కేస్ వేసిన సదరు రచయితతో కాంప్రమైజ్ అయ్యాడు. అతనికి కథ కోసం 30లక్షలుచెల్లించడమే కాదు.. సినిమాలోనూ తెరపై రచయితగా ఒరిజినల్ రైటర్ పేరు కూడా వేయబోతున్నారు. మరి ఇదేదో ముందే చేసి ఉంటే కనీసం పరువన్నా పోకుండా ఉండేది కదా అని అతనిపై సెటైర్స్ వేస్తున్నారు. మొత్తంగా ఇకపై మురుగదాస్ తో సినిమా చేయాలంటే ఆ సినిమా హీరోతో పాటు నిర్మాతలు కూడా కథ విషయంలో ఒకటికి నాలుగుసార్లు చెక్ చేసుకుంటారు. లేదంటే సినిమా అంతాఅయిపోయిన తర్వాత మళ్లీ ఈ తలనొప్పులు ఎవరు పడతారు..

More Related Stories