English   

మరోసారి పొలిటికల్ స్టోరీ లో మహేష్ బాబు 

Mahesh-Babu
2018-10-31 12:14:24

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయబోతున్నాడా..? ఈ సారి ముఖ్యమంత్రిగా కాక ప్రతిపక్ష నేతగా ఉండబోతున్నాడా..? అంటే అవుననే అంటోంది ఫిల్మ్ నగర్. ఈ సమ్మర్ లో భరత్ అనేనేను లో ముఖ్యమంత్రిగా అలరించిన మహేష్ బాబు మరోసారి పొలిటికల్ సబ్జెక్ట్ పై మనసు పారేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి ఓ రేంజ్ స్టార్ హీరోలు పొలిటికల్ సబ్జెక్ట్స్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. అలాంటిది మహేష్ బాబు వెంటనే మరోసారి అలాంటి సబ్జెక్ట్ కు ఓకే చెప్పాడంటే కథలోని కంటెంట్ బాగా ఆకట్టుకుని ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు.. మరి  ఈసారి మహేష్ ను పాలిటిక్స్ లోకి దించుతోన్న దర్శకుడెవరో తెలుసా..?

రంగస్థలంలో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన దర్శకుడు సుకుమార్, మహేష్ కాంబోలో కొత్త సినిమా ఆల్రెడీ ఓకే అయింది. అయితే రీసెంట్  గా సుక్కూ మరోసారి 80స్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథనే మహేష్ కు చెప్పాడు. బట్ అది ఆయనకంతగగా నచ్చలేదు. దీంతో ఈ సారి  ఓ పొలిటికల్ సబ్జెక్ట్ తో వెళ్లాడట. స్క్రిప్ట్ లైన్ వినగానే మహేష్ వెంటనే ఓకే చెప్పినట్టు టాక్. ప్రస్తుతం సుకుమార్ ఈకథను మరింత పకడ్బందీగా రాసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఈ పొలిటికల్ డ్రామాలో ఊహించని ట్విస్ట్ లు కూడా ఉంటాయని టాక్. అవన్నీ సుకుమార్ స్టైల్ లోనే సాగుతాయట. ఓ సాధారణ యువకుడి నుంచి అసాధారణ నాయకుడిగా ఎదిగిన ఓకామన్ మ్యాన్ కు సంబంధించిన కథ అంటున్నారు. అలాగే ఇందులో సుక్కూ మార్క్ లో సాగే ఓ సూపర్బ్ లవ్ స్టోరీ కూడా ఉంటుందని వినిపిస్తోంది. మొత్తంగా మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో ఎలాంటిసినిమా వస్తుందనుకుంటోన్న ఫ్యాన్స్ కు ఓ క్లారిటీ వచ్చేసినట్టే.. 

నిజానికి భరత్ అనేనేనులో చాలా సీన్స్ ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. కాంబినేషన్ క్రేజ్ కొద్దీ ఆడేసింది కానీ.. నిజంగా అందులో అంత పెద్ద కంటెంట్ కూడా ఏం లేదు. కానీ ఈ సారి అలా కాదు... కేవలం కంటెంట్  పైనే పూర్తిగా దృష్టిపెట్టినట్టు చెబుతున్నారు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఒన్ నేనొక్కడినే’ ఫ్లాప్ కావడం వల్ల ఈసారి ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేయకుండా చూడాలనేదివీరి ప్లానట.

More Related Stories