English   

చైతూ డ్యాన్సులతో ఊపేశాడుగా

Naga-chaitanya
2018-10-31 13:10:23

నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన సినిమా సవ్యసాచి. చందుమొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు మరో రెండు రోజుల్లో నవంబర్ 2న విడుదల కాబోతోంది. ట్రైలర్ ను బట్టి మోస్ట్ ప్రామిసింగ్ ప్రాజెక్ట్ గా కనిపిస్తోంది. ఇక కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ మూవీ నుంచి ఓసూపర్ హిట్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. దాదాపు రెండు దశాబ్ధాల క్రితం అక్కినేని నాగార్జున హీరోగా నటించిన అల్లరి అల్లుడు సినిమాలోని ఓ సూపర్ హిట్ నంబర్ ను ఈ మూవీ కోసం రీమిక్స్ చేస్తున్నట్టు ముందే చెప్పారు. అప్పట్లో ఏపీని ఊపేసిన ఆ పాట ‘నిన్ను రోడ్డు మీద చూసినదీ లగాయితూ’.. నాగ్ తో పాటు రమ్యకృష్ణ గెస్ట్ అప్పీరియన్స్ లో కనిపించిన ఈ పాట ఇప్పటికీ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూనే ఉంటుంది. అలాంటి సాంగ్ ను చైతూ రీమిక్స్ చేయడమే కాదు.. చాలా రోజుల తర్వాత ఈ పాటలో అద్భుతమైన స్టెప్పులు కూడా వేశాడు.సవ్యసాచిలో మరోసారి చూడబోతోన్న ఈ రీమిక్స్ విచిత్రంగా పాట కంటే చైతన్య స్టెప్పులు హైలెట్ కావడం విశేషం. అటు నిధి అగర్వాల్ కూడా అదిరిపోయే హిప్ మూమెంట్స్ తో ఇరగదీసింది. మొత్తంగా ఈ పాట మరోసారి సినిమాకు ఎస్సెట్ గా నిలిచేలా ఉంది.

More Related Stories