English   

నాన్న బ‌యోపిక్ నాశ‌నం చేయ‌కండి: పురందేశ్వ‌రి

Daggubati-Purandeswari
2018-10-31 14:50:04

ఎన్టీఆర్ బ‌యోపిక్ అంటే మొద‌లుపెట్టినపుడు చాలా ఆస‌క్తి ఉండేది. కానీ ఎవ‌రో ఒక్క‌రు చేస్తార‌నుకుంటే ఎవ‌రికి తోచిన‌ట్లు వాళ్లు చేస్తున్నారు. ఇన్నేళ్ళుగా ఎవ‌రికీ గుర్తు రాని నంద‌మూరి తార‌క రామారావు ఒకేసారి అటు బాల‌య్య‌కు ఇటు వ‌ర్మ‌కు గుర్తొచ్చాడు. దాంతో ఇప్పుడు ఇద్ద‌రూ ఎవ‌రి బ‌యోపిక్ లు వాళ్లు చేస్తున్నారు. ఇప్పుడు దీనిపై ఎన్టీఆర్ కుమార్తే ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి మాట్లాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఎవరికి కావల్సిన విదంగా వారు బయోపిక్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నార‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఈ విష‌యం త‌న‌కు చాలా బాధ క‌లిగిస్తుంద‌ని.. ఇలాంటి చ‌ర్య‌లు అస్స‌లు స‌మంజ‌సం కాద‌ని ఆమె చెబుతున్నారు. 

అస‌లు ఎన్టీఆర్ లాంటి మ‌హ‌నీయుడి జీవితంతో ఇలాంటి ఆట‌లు ఆడుకోవ‌డం బాధ‌గా ఉందంటుంది ఎన్టీఆర్ కూతురు. ఎన్టీఆర్ గారి జీవితం ఓ తెరిచిన పుస్తకం.. ప్రతీ పేజీ ప్రతీ పంతి ప్రతీ అక్షరం‌ తెలుగు ప్రజలకి తెలుసు.. ఆయ‌న జీవితంలో తెలియ‌ని కోణాలు ఏమీ లేవు. ఇప్పుడు లేనిపోనివి చూపించి ప్ర‌జ‌ల ముందు ఆయ‌న గౌర‌వం దిగ‌జార్చే విధంగా ఈ బయోపిక్ లు ఉండకూడదని కోరుకుంటున్నాను అని తెలిపారు పురందేశ్వ‌రి. ఈమె వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే బాల‌య్య చేస్తున్న బ‌యోపిక్ పై కూడా సెటైర్లు ప‌డిన‌ట్లుగా అర్థం అవుతుంది. మ‌రి చూడాలిక‌.. పురందేశ్వ‌రి చెప్పిన‌ట్లుగా ఈ బ‌యోపిక్ లు ఉండ‌బోతున్నాయో.. లేదంటే నిస్ప‌క్ష‌పాతంగానే బ‌యోపిక్ లు చేస్తారో..?

More Related Stories