English   

చ‌ర‌ణ్ సంక్రాంతికి వ‌స్తున్నాడు.. ఎనీ డౌట్స్..!  

Ram-Charan
2018-10-31 15:08:07

రామ్ చ‌ర‌ణ్ సంక్రాంతికి వ‌స్తున్నాడా లేదా..? ఈయ‌న బోయ‌పాటితో చేస్తున్న సినిమా షూటింగ్ అనుకున్న టైమ్ కు పూర్త‌వుతుందా లేదా..? ఇవే ఇప్పుడు అభిమానుల్లో వ‌స్తున్న అనుమానాలు.. అయితే ఆ నోటా ఈ నోటా ప‌డి అవి ద‌ర్శ‌క నిర్మాతల వ‌ర‌కు చేరిన‌ట్లున్నాయి. అందుకే సినిమా ప‌రిస్థితిపై ఓ క్లారిటీ ఇచ్చేసారు. అంతా అనుకుంటున్న‌ట్లు ఈ చిత్రం పోస్ట్ పోన్ కాలేదు. అలాగ‌ని షూటింగ్ కూడా నెమ్మ‌దిగా ఏం సాగడం లేదు. న‌వంబ‌ర్ 10 లోపు షూటింగ్ అంతా అయిపోతుంద‌ని క్లారిటీ ఇచ్చాడు బోయ‌పాటి శీను. రెండు పాట‌లు.. డ‌బ్బింగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంటాయ‌ని.. అవి కూడా న‌వంబ‌ర్ 9 నుంచి మొద‌లు పెడుతున్నాం అని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. 

స్వ‌యంగా ద‌ర్శ‌కుడి నుంచే స‌మాధానం రావ‌డంతో శాంతించారు అభిమానులు. సినిమాటోగ్ర‌ఫ‌ర్ రిషి పంజాబి మారిపోయి ఆర్థ‌ర్ విల్స‌న్ వ‌చ్చిన త‌ర్వాత వాయిదా ప‌డుతుందేమో అనుకున్నారంతా. కానీ సంక్రాంతికే అనుకున్న టైమ్ కే సినిమా విడుద‌ల కావ‌డం ఖాయం అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ప‌ది రోజులు మిన‌హా టాకీ కూడా పూర్తి అయిపోయింది. న‌వంబ‌ర్ 5 నుంచి రాజ‌మౌళి సినిమాతో బిజీ కానున్నాడు చ‌ర‌ణ్. మ‌రోవైపు బోయ‌పాటి సినిమాను కూడా ఒకేసారి పూర్తి చేస్తాడు. జ‌న‌వ‌రి 11న ఈ చిత్రం విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది. ఎవ‌డు.. నాయ‌క్ త‌ర్వాత మ‌రోసారి పండ‌క్కి వ‌స్తున్నాడు చ‌ర‌ణ్. ఆ రెండు విజ‌యాలే.. మ‌రి ఈ సారి ఏం చేస్తాడో చూడాలిక‌..!

More Related Stories