English   

ఏం భ‌యం లేదు.. తార‌క్ ఇంకో సినిమా చేస్తాడు.. 

NTR
2018-10-31 16:58:19

ఇప్ప‌టికే రాజ‌మౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు క‌దా.. మ‌రో సినిమా తార‌క్ ఎక్క‌డ్నుంచి చేస్తాడు అనుకుంటున్నారా..? ఈయ‌న అర‌వింద స‌మేత సినిమాతో కాస్త ఊర‌ట‌చెందాడు. తండ్రి మ‌ర‌ణం బాధ‌ను కాస్తైనా మరిచిపోయాడు. అయితే ఎన్టీఆర్ కోరుకున్న‌ట్లుగా అర‌వింద స‌మేత బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే కాదు. జ‌స్ట్ యావ‌రేజ్ సినిమా అంతే. క‌మ‌ర్షియ‌ల్ గా ఈ చిత్రం 95 కోట్లకు పైగానే వ‌సూలు చేసింది కానీ ద‌ర్శ‌క నిర్మాత‌లు మాత్రం 100 కోట్ల షేర్ అంటున్నారు. ఏది ఎలా ఉన్నా.. ఇప్ప‌టికీ కొంద‌రు బ‌య్య‌ర్లు మాత్రం అర‌వింద స‌మేత‌ను న‌మ్ముకుని మునిగిపోయారు. ముఖ్యంగా ఓవ‌ర్సీస్ లో అయితే దాదాపు 3 కోట్ల వ‌ర‌కు ఈ చిత్రం న‌ష్టం తీసుకొచ్చింది. అజ్ఞాత‌వాసి వ‌చ్చింద‌ని అర‌వింద స‌మేత ఇస్తే.. ఇది కూడా ముంచేసింది. 

దాంతో ఇప్పుడు దీనికి త‌నే బాధ్య‌త‌గా తీసుకుని హారిక హాసినికి మ‌రో సినిమా చేయ‌డానికి ఎన్టీఆర్ ముందుకొచ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే నిజం అయితే క‌న‌క ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణ‌యం అద్భుత‌మే. నిర్మాత‌లు న‌ష్ట‌పోయినా.. బ‌య్య‌ర్లు న‌ష్ట‌పోయినా హీరోలు ఇలా బాధ్య‌త తీసుకుంటే ఇండ‌స్ట్రీ కూడా చ‌ల్ల‌గా ఉంటుంది. ఎందుకంటే భారీ సినిమాలు కొట్టే దెబ్బ‌కు నిర్మాణ సంస్థ‌లు కూడా ఎగిరిపోతున్నాయి. చిన్న సినిమాలు పోయినా కూడా న‌ష్టం పెద్ద‌గా ఉండ‌దు.. అదే ఒక్క‌టి కానీ భారీ సినిమా దెబ్బ కొట్టిందంటే సీన్ లో కూడా క‌నిపించ‌రు. ఎన్టీఆర్ సినిమాల‌కు కూడా ఇది జ‌రిగింది. అందుకే అర‌వింద స‌మేత న‌ష్టాల‌ను తానే బాధ్య‌త‌గా తీసుకుంటున్నాడు జూనియ‌ర్. ప్ర‌స్తుతం ఈయ‌న జ‌క్క‌న సినిమాతో బిజీగా ఉన్నాడు. మ‌రి హారిక హాసిని క్రియేష‌న్స్ లో చేయ‌బోయే సినిమా ఏ ద‌ర్శ‌కుడితో అనేది మాత్రం స‌స్పెన్స్.

More Related Stories