English   

అనుప‌మ్ ఖేర్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. 

Anupam-Kher
2018-10-31 17:16:19

బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ షాక్ ఇచ్చారు. ఆయ‌న న‌టుడిగా ఎంత బిజీగా ఉన్నా కూడా త‌న బాధ్య‌త‌లు కూడా నిర్వ‌ర్తిస్తూనే ఉన్నారు. ఈ న‌టుడు ఇన్నాళ్లూ యాక్ట‌ర్ గానే కాకుండా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గానూ ఉన్నారు. కొన్నేళ్లుగా అనుప‌మ్ ఒక్క‌డే ఈ బాధ్య‌త మోస్తున్నారు. బాలీవుడ్ లో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు.. మీటూ వివాదాలు కూడా ఇందులో ఉండి అనుప‌మ్ నిషితంగా ప‌రిశీలిస్తున్నారు కూడా. అయితే ఇప్పుడు ఉన్న‌ట్లుండి ఈ పదవికి రాజీనామా చేశారు అనుప‌మ్. కార‌ణం అడిగితే తాను నటుడిగా బిజీగా ఉండటం వ‌ల్లే ఈ బాధ్య‌త‌లు స‌రిగ్గా నిర్వర్తించ‌లేక‌పోతున్నాని స‌మాధానం చెప్పారు. అందుకే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ప‌దవి విధుల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈయ‌న చెప్పిన స‌మాధానం బాలీవుడ్ లో కొంద‌రికి న‌చ్చ‌డం లేదు కానీ ఆయ‌న మాత్రం త‌న నిర్ణ‌యం మార్చుకోన‌ని తేల్చేసారు. 

More Related Stories