English   

సాహో చ‌రిత్ర సృష్టిస్తుందా..? 

Saaho
2018-10-31 19:07:13

ప్ర‌భాస్ అభిమానుల‌తో సాధార‌ణ ప్రేక్ష‌కులు.. ఇండ‌స్ట్రీ కూడా కోరుకుంటున్న‌ది ఇదే. క‌చ్చితంగా సాహో చ‌రిత్ర సృష్టించాలి. అప్పుడే తెలుగు సినిమా స‌త్తా ఏంటో ప్ర‌పంచానికి తెలుస్తుంది. ఇప్ప‌టికే బాహుబ‌లి మ‌న‌మేంటో చూపించింది. ఇప్పుడు సాహో కూడా అదే చేసిందంటే దెబ్బ‌కు టాలీవుడ్ రేంజ్ ఎక్క‌డికో వెళ్లిపోతుంది. ఇప్ప‌టికే సాహో 65 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ సినిమా క‌నీవినీ ఎరుగ‌ని యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ను క‌ళ్ల‌ముందుకు తీసుకొచ్చేందుకు క‌ష్ట‌ప‌డుతున్నాడు సుజీత్. ఈ కుర్ర ద‌ర్శ‌కుడి ఏజ్ పాతికేళ్లే కానీ ఆలోచ‌న‌లు మాత్రం అద్భుతం. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం విజువ‌ల్ వండ‌ర్స్ ను మాత్ర‌మే చూపిస్తూ వ‌చ్చిన తెలుగు సినిమాకు ఇప్పుడు యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అంటే ఎలా ఉంటుందో చూపించ‌బోతున్నాడు సుజీత్. 

మొన్న విడుద‌లైన మేకింగ్ వీడియోతోనే సాహో ఎలా ఉండ‌బోతుందో చాలా మందికి క్లారిటీ వ‌చ్చేసింది. ఇప్పుడు దీనికి కొన‌సాగింపు చేస్తున్నాడు సుజీత్. మేకింగ్ లో చూసింది గోరంతే.. సినిమాలో కొండంత ఉంది అంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇందులో ప్ర‌భాస్ ఇంట‌ర్ పోల్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. హాలీవుడ్ నిపుణుల స‌మ‌క్షంలో అద్బుతంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు సుజీత్. సాహో కానీ వ‌ర్క‌వుట్ అయిందంటే దెబ్బ‌కు ప్ర‌భాస్ రేంజ్ బాలీవుడ్ లో చేరిపోవ‌డం ఖాయం. ఎందుకంటే ఇప్ప‌టికే అక్క‌డ మ‌నోడి కోసం కాచుకుని ఖ‌ర్చీఫ్ ప‌ట్టుకుని కూర్చున్నారు నిర్మాత‌లు. ఇప్పుడు సాహో ఆడిందంటే సుజీత్.. ప్ర‌భాస్ ఇద్ద‌రూ తోపులు అయిపోతారు. మ‌రి చూడాలిక‌.. ఈ సాహో నిజంగానే అంత చ‌రిత్ర సృష్టిస్తుందో లేదో..? 

More Related Stories