English   

పవన్ ను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

Pawan Kalyan Look Changed to Powerstar After Long Gap
2018-10-31 19:08:08

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తున్నాడా..? ఈయ‌న ఇంకో సినిమా చేయ‌బోతున్నాడా..? ఎన్నిక‌ల‌కు ముందే మ‌రో సినిమా చేస్తాడా.. అయిన త‌ర్వాత అన్నీ ప్ర‌శాంతంగా ఉన్న టైమ్ లో చేస్తాడా..? ఇప్పుడు ఇలాంటి ప్ర‌శ్న‌లెందుకు వ‌స్తున్నాయ్ అనుకుంటున్నారా.. ? ఇప్పుడు ఈయ‌న లుక్ చూసిన త‌ర్వాత ఈ డౌట్స్ వ‌స్తున్నాయ్ అంతే. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు గ‌డ్డంతో మునిలా క‌నిపించిన ఈయ‌న‌.. చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ హీరోగా మారిపోయాడు. త‌ల్లి అంజ‌నాదేవితో క‌లిసి క‌నిపించిన ప‌వ‌న్.. మున‌ప‌టి గ్లామ‌ర్ ను గుర్తు చేసాడు. స‌డ‌న్ గా ఆయ‌న్ని చూస్తుంటే ప‌వ‌ర్ స్టార్ గుర్తొస్తున్నాడు కానీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గుర్తుకు రావ‌డం లేదు. ఇక ఇప్పుడు ప‌వ‌న్ మ‌న‌సులో కూడా సినిమాలు చేయాల‌నే నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తుంది.

pawan kalyan new look

దీనికి సంబంధించిన తెర‌వెనక ఏర్పాట్లన్నీ వేగంగా జ‌రుగుతున్నాయి. అన్నీ కుదిర్తే ఎల‌క్ష‌న్ త‌ర్వాతే ఓ సినిమా చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. అది కూడా త‌న స్నేహితుడు త్రివిక్ర‌మ్ తోనే. ఈ మ‌ధ్యే ఆయ‌న త్రివిక్ర‌మ్ తో క‌లిసిన‌పుడు ఫ్యూచ‌ర్ ప్రాజెక్టుల‌పై కూడా చ‌ర్చించాడ‌ని తెలుస్తుంది. ఆ మ‌ధ్య ర‌వీంద్ర భార‌తిలో త్రివిక్ర‌మ్ స‌తీమ‌ణి సౌజ‌న్య భ‌ర‌త‌నాట్య ప్ర‌ద‌ర్శ‌న‌కు స‌తీస‌మేతంగా వ‌చ్చాడు ప‌వ‌ర్ స్టార్. అక్క‌డే పాత స్నేహితుడితో చాలా సేపు ముచ్చ‌టించాడు. ఈ ఇద్ద‌రూ ప‌బ్లిక్ ప్లేస్ లో క‌ల‌వక దాదాపు ఆర్నెళ్లు దాటేసింది. అజ్ఞాత‌వాసి త‌ర్వాత ఎవ‌రి దారి వాళ్ల‌దే అన్న‌ట్లున్నారు ఇద్ద‌రూ.

pawan kalyan trivikram

పైగా ఇద్ద‌రి మ‌ధ్య అభిప్రాయ బేధాలు వ‌చ్చాయంటూ వార్త‌లొచ్చాయి. కానీ తాము ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ మంచి స్నేహితుల‌మే అని ఆ వేడుక‌తో నిరూపించారు ఈ ఇద్ద‌రు. ఇదిలా ఉంటే 2020లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ తోనే రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ని తెలుస్తుంది. ఆయ‌న‌తో పాటు మ‌రో రెండు సినిమాలు కూడా ప‌వ‌న్ ఖాతాలో ఉన్నాయ‌ని తెలుస్తుంది. ముఖ్యంగా ఓ క‌న్న‌డ సినిమా రీమేక్ తో పాటు హిందీ రీమేక్ క‌థ కూడా ఒక‌టి ప‌వ‌న్ ద‌గ్గ‌ర ఉంద‌ని.. వీటిలో ఏదో ఒక‌టి ఎల‌క్ష‌న్ త‌ర్వాత ప‌వ‌న్ న‌టిస్తాడ‌ని వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. దీనికి ప‌వ‌న్ వైపు వ‌ర్గాల నుంచి కూడా సానుకూలంగానే స్పంద‌న వ‌స్తుంది.

pawan kalyan with mother anjana devi

దానికితోడు ప‌వ‌న్ సినిమా ఖచ్చితంగా ఉంటుంద‌ని మైత్రి మూవీ మేక‌ర్స్ కూడా ఖచ్చితంగా చెబుతున్నారు. అంటే ఖచ్చితంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను మ‌ళ్లీ సినిమాల్లో ఊహించొచ్చు. పైగా ప‌వ‌న్ కూడా సినిమాల‌కు రిటైర్మెంట్ అయితే ఇవ్వ‌లేదు. బ్రేక్ ఇస్తున్నాన‌ని చెప్పాడంతే. అప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాల్లో ఉన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ప‌వ‌న్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇప్ప‌టికైతే ఇంకా ప‌వ‌న్ తో కొంద‌రు నిర్మాత‌లు సినిమాలు క‌మిటై ఉన్నారు. వాళ్ల‌కు ప‌వ‌న్ కూడా వీలు చిక్కిన‌పుడు సినిమా చేస్తాన‌ని చెప్పాడు కూడా. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌ర‌గ‌బోతుందో..?

More Related Stories