English   

శబ‌రిమ‌ల ఇష్యూపై మ‌నోజ్ సంచ‌ల‌న స‌మాధానం..

Manchu-Manoj
2018-11-01 08:36:12

ఇప్పుడు దేశంలో ఎక్క‌డ విన్నా.. చూసినా కూడా శ‌బ‌రిమ‌ల గురించి చాలా ర‌చ్చ జ‌రుగుతుంది. మ‌హిళ‌ల‌ను ఆలయంలోకి ప్ర‌వేశింప‌చేయ‌డం సంప్ర‌దాయాల‌ను కించ‌ప‌రచ‌డ‌మే అని అల్ల‌ర్లు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. 10 నుంచి 50 వ‌ర‌కు మ‌హిళ‌లు గుళ్లోకి వ‌స్తే వాళ్ల‌కు ఉన్న కొన్ని శ‌రీర స‌మ‌స్య‌ల వ‌ల్ల గుడి అప‌విత్రం అయిపోతుంద‌ని కొంద‌రి వాద‌న‌. అలాంటి వయసున్న మహిళల కోసం ఇంకొన్ని అదనపు సౌకర్యాలు క‌ల్పించే వ‌ర‌కు అయినా వారి ప్రవేశాన్ని నిరోధించాలని కోరుతూ వేసిన పిటిషన్ ని కేరళ హైకోర్టు కొట్టివేసింది. సుప్రీం కోర్టుని ఆశ్రయించాలంటూ పిటిషనర్ కి సూచించింది. ఇప్పుడు ఈ ఇష్యూపైనే అంతా పోరాడుతున్నారు. ఇప్ప‌టికే ఈ విష‌యంపై చాలా మంది ప్ర‌ముఖులు కూడా మాట్లాడారు. ఇప్పుడు ఈ విష‌యం మ‌నోజ్ ద‌గ్గ‌రికి వ‌చ్చింది. మంచు మ‌నోజ్ ఈ మ‌ధ్య సినిమాలు పూర్తిగా మానేసారు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. 

ఇప్పుడు ఓ అభిమాని చ‌ర‌ణ్, మ‌నోజ్ అయ్య‌ప్ప మాలలో ఉన్న ఫోటో షేర్ చేసి.. మీరు కూడా ఈ ఇష్యూపై ఏదో ఒక‌టి చెప్పండి స‌ర్ అంటూ పోస్ట్ చేసాడు. దానికి మ‌నోజ్ సమాదానం చెప్పాడు. పేదలకు తిండి, నీరు, చదువు వంటి సౌకర్యాలు అందడం లేదని మేమంతా చింతిస్తున్నాం. మనం ముందు వారి గురించి ఆలోచించాలి. మనందరికీ దేవుడిపై నమ్మకం ఉంది కదా… అలాంటప్పుడు ఆయనకి వచ్చిన సమస్యను ఆయనే పరిష్కరించుకుంటాడు. మనమంతా మానవత్వం వైపు నిలబడతాం అంటూ తెలివైన సమాధానం చెప్పాడు. మ‌నోజ్ ఇచ్చిన స‌మాధానంతో ఆ అభిమాని కూడా సంతోష‌ప‌డ్డాడు. మొత్తానికి నిజ‌మే క‌దా.. దేవుడు ఉన్నాడ‌ని మ‌నం న‌మ్ముతున్నపుడు ఆయ‌న స‌మ‌స్య‌ను ఆయ‌న ప‌రిష్క‌రించుకోలేడా.. అందుకే అయ్య‌ప్ప దేవాయ న‌మః అంటూ అంతా ఆ స్వామికే వ‌దిలేస్తే స‌రిపోతుంది. ఏది మంచి అనిపిస్తే అది చేసి చూపిస్తాడు ఆయ‌నే. 

More Related Stories