English   

సవ్యసాచి ప్రివ్యూ : 'చే' కు కీలకం.. చందుకు ఇంపార్టెంట్

Savyasachi-Preview
2018-11-01 10:51:34

మరికొన్ని గంటల్లో సవ్యసాచి ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీపై నాగచైతన్యచాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇంతకు ఇలా హోప్స్ పెట్టుకున్న శైలజారెడ్డి అల్లుడు అంచనాలు అందుకోవడం లో హండ్రెడ్ పర్సెంట్ సక్సస్ కాలేదు. పైగా అంతకు ముందు వచ్చిన యుద్ధంశరణం డిజాస్టర్ అయితే రారండోయ్ వేడుక చూద్దాం కూడా అబౌ యావరేజ్ గా నిలిచింది. దీంతో ప్రేమమ్ తర్వాత వచ్చిన ఫేమ్ ను కంటిన్యూ చేయడంలో కాస్త విఫలమయ్యాడు చైతూ. అందుకే మరోసారి ప్రేమమ్ దర్శకుడు చందు మొండేటికే నా ఓటు అనేశాడు. ఫస్ట్ మూవీలో ‘యానిమల్ హిప్నాటిజం’ అనే కాన్సప్ట్ తో ఆకట్టుకున్న చందు ఈసారి కూడా అలాంటి మరో సైంటిఫిక్ రీజన్ తో వస్తున్నాడు. ఒకే శరీరం పంచుకుని పుట్టిన ఇద్దరు కవలల  కథ ఇది. అందుకే తను ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇద్దరు రియాక్ట్ కావాలంటున్నాడు చైతూ. 

నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ మాధవన్ విలన్ గా నటించాడు. భూమిక చావ్లా చైతూ సిస్టర్ గా ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ప్రామిసింగ్ గానే కనిపించింది. పైగా ఇప్పుడు కొత్త కాన్సెప్ట్స్ కు ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. దీంతో చైతూకు సవ్యసాచి మంచి విజయంగా నిలిచే అవకాశం ఉంది. కాకపోతే కొంత టెన్షన్ ఉన్నట్టుకనిపిస్తున్నాడు. 
 
ఇక కీరవాణి అందించిన సంగీతం మరో హైలెట్ గా కనిపిస్తోంది. మామూలుగా ప్రస్తుతం కీరవాణి కంటెంట్ నచ్చితేనే సంగీతం అందిస్తున్నాడు. అందువల్ల ఇందులో ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా రేపు విడుదల కాబోతోన్న  ఈ మూవీ రిజల్ట్ చైతూకు కీలకం అయితే.. చందుకు ఇంపార్టెంట్.. చందుకు ఇంపార్టెంట్ ఎందుకంటే.. అతను తనకు ఇలాంటి కాన్సెప్ట్స్ తో సినిమాలు చేయడమే ఇష్టం అని ముందునుంచీ చెబుతున్నాడు. అతనికి ఇష్టమైతే సరిపోదు కదా. ఆడియన్స్ కూ నచ్చాలి. ఈ మూవీ కూడా నచ్చితే అప్పుడు చందు కాన్సెప్ట్స్ కు ప్రేక్షకులు ఆమోద ముద్ర వేసినట్టవుతుంది. అందుకే ఇది చందుకు ఇంపార్టెంట్. మొత్తంగా సవ్యసాచి ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుంటామో మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది.

More Related Stories