English   

నాగార్జునకు  కథ నచ్చలేదు.. బట్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు

Rahul-Ravindran
2018-11-01 12:22:36

నటుడిగా అయితే ఫర్వాలేదు కానీ.. హీరోగా కొనసాగే విషయంలో నాగార్జున చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాడు. సరైన స్క్రిప్ట్ ఓ ప్రాబ్లమ్ అయితే... ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ వయసులో తను ఎలాంటి కథలు ఎంచుకుంటే బావుంటుందనే విషయంలో క్లారిటీ లేకపోవడం మరోటి. మొత్తంగా సోగ్గాడే చిన్నినాయనా తర్వాత వరుసగా హీరోగా సినిమాలు చేస్తాడనుకుంటే నాగ్ అందుకు భిన్నంగా ఆఫీసర్ అవతారం ఎత్తి అనవసరంగా దెబ్బయిపోయాడు. ప్రస్తుతం హిందీలో బ్రహ్మాస్త్ర, తమిళ్ లో ధనుష్ హీరోగా నటిస్తోన్న ‘నాన్ రుద్రన్’సినిమాలోనూ నటిస్తోన్న నాగ్ రీసెంట్ గా నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కు ఓ అవకాశం ఇచ్చాడు. మంచి స్క్రిప్ట్ తీసుకురావాలని. దర్శకుడుగా చేసిన ఫస్ట్ మూవీ ‘చిలసౌ’తో మంచి మార్కులు కొట్టేసిన రాహుల్.. రీసెంట్ గా నాగ్ కోసం ఓ కథ పట్టుకుని వెళ్లాడు. కథ నాగార్జునకు బాగా నచ్చింది. కానీ తాను చేయను అన్నాడట. 

రాహుల్ తెచ్చిన కథ నాగ్ కు నచ్చింది. బట్ అది తన ఏజ్ కు సరిపోయే కథ కాదు అనిపించిందట. అందుకే ఈ కథ నేను చేయలేను అన్నాడు.  అయితే ఊహించని విధంగా రాహుల్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు. ఏంటంటే.. ఈ కథ అఖిల్ కు కానీ, చైతన్యకు కానీ నచ్చితే నేనే ప్రొడ్యూస్ చేస్తా అన్నాడట. అంటే నిజంగానే కథ బావుంది. కానీ నాగ్ తనకు సూట్ కాదనుకున్నాడు. మంచి కథ కాంపౌండ్ దాటొద్దనే ఇలా తనయులకూ చెప్పమని సూచించాడు. మరి ఈ కథ అన్నదమ్ముల్లో ఎవరికి ముందు నచ్చుతుందో... ఎవరు ఓకే చేస్తారో చూడాలి. 

More Related Stories