English   

ఇద్దరు హీరోయిన్లను మోసం చేసిన రవితేజ 

Ravi-Teja
2018-11-01 06:18:13

మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం అమర్ అక్బర్ ఆంటోనీగా రెడీ అవుతున్నాడు. ఈ మూవీలో మూడు పాత్రల్లో కనిపించబోతోన్న రవితేజ నెక్ట్స్ మూవీలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు. ఈ మధ్య వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతోన్న రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేలానే ఉన్నాడు. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో కిక్ బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తోంది. మొత్తంగా ఈ మూవీతో పాటే గతంలోనే మరో సినిమాకూ గ్రీన్ సిగ్నల్  ఇచ్చాడు రవితేజ. ఆసినిమాకు విఐ ఆనంద్ డైరెక్టర్.  ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న ఆనంద్ రవితేజతో ఓ థ్రిల్లర్ సినిమా తీయబోతున్నాడు. ఈజానర్ లో సినిమా చేయడం మాస్ రాజాకు ఇదే ఫస్ట్ టైమ్. 

ఇక ఈ సినిమాలో రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారట. అయితే వీరిలో ఇద్దరు హీరోయిన్లు ఇప్పుడు మోసపోయారు. పాపం రవితేజ సరసన ఛాన్స్ అనగానే ఎగిరి గంతేసిన ఆ బ్యూటీలకు సడెన్ గా చెక్ పెట్టాడు దర్శకుడు. ఇప్పటి వరకూ వినిపించిన ఆ బ్యూటీస్ ఇద్దరూ ఇందులో సెకండ్, థర్డ్ హీరోయిన్లు. అంటే మెయిన్ హీరోయిన్ మరో బ్యూటీ ఉంది. మరి ఈ ఇద్దరు బ్యూటీస్ ఎవరో తెలుసా..?

రీసెంట్ గా ‘నన్నుదోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ ను అట్రాక్ట్ చేసిన నభా నటేష్ తో పాటు ‘ఆర్ఎక్స్ 100’తో బోల్డ్ బ్యూటీ అనిపించుకున్న పాయల్ రాజ్ పుత్. నిజానికి రవితేజ సరసన ఆఫర్ వచ్చిందని ఈ భామలు తెగ సంబరపడ్డారు. కానీ వీరుకాక మరో మెయిన్ హీరోయిన్ ఉంటుందని లేటెస్ట్ గా చెప్పారు. మరి ఈ విషయం ముందే వీరికి తెలుసో లేదో కానీ.. తెలియకుంటే ఈ భామలను మాస్ రాజా అండ్ డైరెక్టర్ మోసం చేసిననట్టే.

More Related Stories