English   

తెలుగు మార్కెట్ పై శంకర్ మాస్టర్ ప్లాన్

Shankar
2018-11-01 09:04:25

తమిళ దర్శకుడు శంకర్ కు అక్కడి కంటే ఎక్కువగా మన దగ్గరే మార్కెట్ ఉంది. సౌత్ సినిమాలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన దర్శకుడుగా శంకర్ కు మంచి పేరే ఉంది.కానీ ఒకే ఒక్క రీమేక్ తో టచ్ కోల్పోయాడు. భారీ ఆశలు అంనాలు పెంచిన ‘ఐ’ డిజాస్టర్ అయింది. దీంతో శంకర్ ఒక్కసారిగా డల్ అయ్యాడు. ఈ లోగా రాజమౌళి బాహుబలితో ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ తీశాడు. ఒక రకంగా ఇండియన్ సినిమాలో హై ఎండ్ టెక్నాలజీని పరిచయం చేసిన శంకర్ కు ఇది మింగుడు పడలేదు. అందుకే అత్యంత భారీ బడ్జెట్ తో ‘2.0’కు స్క్రిప్ట్ లేపాడు. చాలాకాలంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ మూవీ మొత్తంగా ఫైనల్ స్టేజ్ కు వచ్చింది. నవంబర్ 3న ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ నెల 29న సినిమా కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే హీరోగా నటించిన రజినీకి కూడా తెలుగులో తిరుగులేని మార్కెట్ ఉంది. దీంతో శంకర్ ఓ భారీ ప్లాన్ వేశాడు. 

2.0 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. అక్కడ వాళ్లే రిలీజ్ చేసుకుంటున్నారు. అయితే తెలుగులో గతంలోనే 80 కోట్లకు బేరం పెట్టారు. కొందరు నిర్మాతలు ముందుకు వచ్చారు కూడా.. కానీ సినిమాబాగా లేట్ అయింది. ఈ లోగా బజ్ పోతుందనుకున్నారు. పైగా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేదానికి క్లారిటీ లేదు. దీంతో ముందు 80కోట్లకు కమిట్ అయిన వాళ్లు కూడా కాదని వెనక్కి వెళ్లారు. అయితే ఇప్పుడు అంత కాకున్నా కాస్త అటూ ఇటూగా కొందరు ముందుకు వస్తున్నారు. బట్ లైకా ప్రొడక్షన్స్ మాత్రం ఈ సారి ఎవరికీ ఇవ్వడం లేదు. తెలుగులోనూ తామే సొంతంగా విడుదల చేసుకోబోతున్నారు. పైగా ఈ తెలుగువెర్షన్ తోనే ఏకంగా  వంద కోట్లు కొల్లగొట్టాలనే ప్లాన్ చేస్తున్నారు. యస్.. శంకర్ కూడా తెలుగు మార్కెట్ నుంచి 2.0 కు కనీసం వంద కోట్లైనా సాధించాలనే మాస్టర్ ప్లాన్ చేశారు. తద్వారా రాజమౌళికి ఇన్ డైరెక్ట్ గా తన మార్కెట్ రేంజ్ ను చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు అనుకోవచ్చు. 

మరి వీళ్ల ప్లాన్ వర్కవుట్ అయ్యి.. వంద కోట్లు రావాలంటే ముందు సినిమాలో దమ్ముండాలి కదా. ట్రైలర్ ఎలాగూ ఆకట్టుకుంటుంది. కానీ సినిమాకు డే వన్ వచ్చే టాక్ ను బట్టి అది హండ్రెడ్ క్రోర్ మూవీనా కాదా అనేది తేలుతుంది. ఒకవేళ ఏ మాత్రం తేడా వచ్చినా మనోళ్ల అసలే ‘ఐ’షాక్ ను ఇంకా మర్చిపోలేదు కాబట్టి.. తిరిగి శంకర్ కే రీ షాక్ ఇస్తారు.

More Related Stories