English   

మాధవన్ పై దేశద్రోహం కేస్

ROCKETRY
2018-11-01 16:24:24

నటుడుగా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు మాధవన్. ప్రస్తుతం తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ తెలుగు సినిమాలో నటించాడు. నవంబర్ 2న విడుదలవుతోన్న ‘సవ్యసాచి’లో విలన్ నటించాడు. నటుడుగా కెరీర్ ఆరంభించి రెండు దశాబ్దాలవుతోన్నా ఇంకా చాక్లెట్ బాయ్ లుక్స్ తోనే  కనిపిస్తోన్న మాధవన్ పై దేశద్రోహం కేస్ పెట్టారట. ఈ కేస్ కు కారణం కూడా అతనే. మాధవన్ దేశద్రోహం కేస్ ఏంటని షాక్ అవుతున్నారా.. కేస్ నిజమే కానీ.. రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో. యస్.. మాధవన్ ఇప్పుడు మరో  కొత్త పాత్రలోకి వెళుతున్నాడు. ఇన్నాళ్లూ నటుడుగా అలరించిన మ్యాడీ.. ఫస్ట్ టైమ్ మెగాఫోన్ పట్టాడు. అది కూడా ఓ బయోపిక్ తో.

ఇస్రో శాస్త్రవేత్త నంబినారాయణ్  జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించబోతున్నాడు. కొన్నాళ్ల క్రితం అతి తక్కువ ఖర్చుతో అమెరికా, రష్యాలు పంపిన రాకెట్స్ ను అంతరిక్షంలోకి పంపిన శాస్త్రవేత్తల్లో కీలక వ్యక్తే ఈ నంబి నారాయణ్. అయితే ఈయన జీవితం సినిమా కథను తలపిస్తుంది. అత్యంత ప్రతిభావంతుడైన ఆయన్ని 1994లో విదేశాలకు గూఢచారిగా వ్యవహరిస్తున్నాడని పోలీస్ లు అరెస్ట్ చేశారు. దేశద్రోహం కేస్ పెట్టి జైలులో పెట్టారు. తనపై వచ్చిన ఆరోపణకు వ్యతిరేకంగా సుదీర్ఘమైన పోరాటం చేసి ఫైనల్ గా నిర్దోషిగా విడుదలయ్యాడు. ఆ తర్వాత మళ్లీ శాస్త్రవేత్తగా దేశానికి సేవలు అందిస్తున్నారు. మరి ఇలాంటి కథ వెండితెరపైకి వస్తే ఖచ్చితంగా మంచి ఇన్స్ స్పైరింగ్ స్టోరీ అవుతుంది. అందుకే ఆయన పాత్రలో నటిస్తూ మాధవన్ ఈ చిత్రానికకి దర్శకుడిగానూ బాధ్యతలు తీసుకున్నాడు. 

మొత్తంగా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ విడుదలయ్యే ఈసినిమా టీజర్ ను విడుదల చేశారు. మాధవన్ దర్శకుడుగా కూడా సక్సెస్ కాబోతున్నాడు అనేలా వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉందీ టీజర్.

More Related Stories