English   

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి మహానటి

Mahanati
2018-11-01 16:50:03

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన మహానటి సినిమా వంద రోజులు పూర్తి చేసుకుంది. మహానటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటన సావిత్రిని తలపించిందనే పేరు తెచ్చుకుంది. సావిత్రి జీవిత కథ వెండితెరపైనా అద్భుతంగా వర్కవుట్ అయింది. వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ కూతుళ్లు స్వప్నదత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడు. కొన్ని వర్గగాల నుంచివిమర్శలు అందుకున్నా ఓవరాల్ గా మహానటి తెలుగు వారికి విపరీతంగా నచ్చింది. అటు కమర్షియల్ గానూ సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి లేటెస్ట్ గా ఓ అరుదైన గౌరవం దక్కింది. 47వ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అఫీషియల్ ప్రదర్శించే గౌరవం అందుకుంది.  ఇక ఈ యేడాదికి ప్రకటించే నేషనల్ అవార్డ్స్ లోనూ మహానటి తెలుగు నుంచి సత్తా చాటేఅవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.  మొత్తంగా మహానటి విజయం.. తెలుగులో మరిన్ని బయోపిక్స్ కు దారిచూపించింది. 

More Related Stories