English   

చైతూ అంత తెస్తే స‌వ్య‌సాచి అనిపించుకుంటాడు.. 

Savyasachi
2018-11-01 10:02:49

నాగ‌చైత‌న్య సినిమాల‌కు మెల్ల‌గా గ్రాఫ్ పెరుగుతుంది. ఆయ‌న సినిమాలు కూడా భారీ బిజినెస్ చేస్తున్నాయి. శైల‌జారెడ్డి అల్లుడు దాదాపు 25 కోట్ల బిజినెస్ చేసింది. వ‌సూలు చేయ‌డం కూడా 19 కోట్ల‌కు పైగానే తీసుకొచ్చింది. ఇప్పుడు స‌వ్య‌సాచి కూడా దాదాపు అదే రేంజ్ లో బిజినెస్ చేసింది. ఈ చిత్రం కూడా 22.5 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పుడు నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచి అనిపించుకోవాలంటే అక్ష‌రాలా 24 కోట్లు తీసుకురావాలి. మైత్రి మూవీ మేక‌ర్స్ కు ఉన్న క్రేజ్.. చందూమొండేటి-చైతూ డిమాండ్.. సినిమాపై ఉన్న అంచ‌నాలు చూస్తుంటే ఇదేం పెద్ద ల‌క్ష్యం అయితే కాదు. కాక‌పోతే తొలి రోజు తొలి షోకే సినిమా పాజిటివ్  టాక్ తెచ్చుకోవాలి. అప్పుడే స‌వ్య‌సాచి బ‌య‌ట‌ప‌డ‌తాడు. ఇప్పుడు చైతూతో పాటు టీం అంతా ప్రార్థిస్తున్నది కూడా అదే. 

ఎందుకంటే సినిమా క‌చ్చితంగా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కంతోనే ఉన్నారంతా. ముఖ్యంగా నైజాంలో శైల‌జారెడ్డి అల్లుడు 5 కోట్ల‌కు పైగా షేర్ తీసుకొచ్చింది. ఇప్పుడు స‌వ్య‌సాచి 5.50 కోట్ల‌కు అమ్మారు. ఇక ఓవ‌ర్సీస్ కూడా 3.5 కోట్ల‌కు అమ్మారు. ఇది చాలా పెద్ద మొత్తం. అయినా కూడా సినిమాపై న‌మ్మ‌కంతో తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే స‌వ్య‌సాచిని 17.1 కోట్ల‌కు అమ్మారు. ఇక మిగిలిన ఏరియాల్లోనూ చైతూ కెరీర్ లో బెస్ట్ రేట్ కు వెళ్లాయి. మొత్తంగా 23 కోట్ల‌తో గేమ్ మొద‌లుపెట్టాడు చైతూ. అంత చేరుకుంటే చై హిట్ కొట్టిన‌ట్లే.. లేదంటే మ‌రోసారి నిరాశ ప‌రిచిన‌ట్లే. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..? న‌వంబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 800 స్క్రీన్స్ లో విడుద‌ల కానుంది స‌వ్య‌సాచి. 

More Related Stories