English   

విరాట‌ప‌ర్వంలో రానా.. సాయిప‌ల్లవితో రొమాన్స్.. 

Rana-Daggubati
2018-11-01 18:29:36

ఒక్క‌సారి ఊహించుకోండి.. రానా ముందు సాయిప‌ల్ల‌వి ఎలా ఉంటుందో..? ఫ‌స్ట్ ఫ్లోర్ కాదు.. ఏకంగా మూడో ఫ్లోర్ లో ఉన్న‌ట్లుంటుందేమో..? వ‌రుణ్ తేజ్ కూడా అలాగే ఉంటాడు కానీ క‌నీసం ఆయ‌న ఫిజిక్ కాస్త త‌క్కువ‌గా ఉంటుంది. కానీ రానా మాత్రం భ‌ళ్ళాళ‌దేవుడు. ఇప్పుడు సాయిప‌ల్ల‌వితో ఈ హీరో న‌టించ‌బోతున్నాడు. ఈయ‌న విరాట ప‌ర్వం 1992లో సాయిప‌ల్ల‌వితో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడ‌ని తెలుస్తుంది. ఇది వ‌ర‌కు ఈ చిత్రం శ‌ర్వానంద్ చేస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. పైగా ఇప్పుడు ఇద్ద‌రూ క‌లిసి ప‌డి ప‌డి లేచే మన‌సులో న‌టిస్తున్నారు కాబ‌ట్టి అదే కెమిస్ట్రీ ఇందులో కూడా వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని భావించాడు ద‌ర్శకుడు వేణు ఉడుగుల‌. అయితే ఎందుకో తెలియ‌దు కానీ చివ‌రి నిమిషంలో శ‌ర్వా ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నాడు. సాయిప‌ల్ల‌వి యాటిట్యూడ్ కార‌ణంగా ఆమెతో న‌టించ‌డానికి హీరోలు ఆస‌క్తి చూపించ‌డం లేద‌నే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు కూడా మ‌న ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. 

నాని, నాగ‌శౌర్య లాంటి హీరోల‌తో సాయిప‌ల్ల‌వి గొడ‌వ ప‌డింద‌నే ప్ర‌చారం జ‌రిగింది కూడా. ఇక సూర్య‌తోనూ ఇలాంటి స‌మ‌స్య‌లే వ‌చ్చాయి ఈ భామ‌కు. అందుకే ఈమెతో న‌టించ‌డం ఇష్టం లేకే ఇన్నాళ్లూ వేణు ఉడుగుల ఏ హీరోకు క‌థ చెప్పినా కూడా సాయిప‌ల్ల‌వి ఉంద‌నే ఎవ‌రూ ఓకే చెప్ప‌డం లేద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే రానా మాత్రం క‌థ న‌చ్చ‌డంతో హీరోయిన్ తో పనిలేకుండా సై అన్నాడ‌ని తెలుస్తుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రంపై పూర్తి వివ‌రాలు బ‌య‌టికి రానున్నాయి. 1992 స‌మ‌యంలో జ‌రిగే క‌థ ఇది. అప్ప‌ట్లో జ‌రిగిన కొన్ని ఒరిజిన‌ల్ ఇన్సిడెంట్స్ ను ఈ క‌థ‌లో చూపించ‌బోతున్నాడు వేణు ఉడుగుల‌. ఈయ‌న చేసిన తొలి సినిమా నీది నాది ఒకేక‌థ క‌మ‌ర్షియ‌ల్ గా హిట్ కాక‌పోయినా ఆలోచింప‌జేసే సినిమాగా నిలిచింది. ఇప్పుడు రెండో సినిమా కాస్త భారీగా ప్లాన్ చేస్తున్నాడు వేణు. మ‌రి సాయిప‌ల్ల‌వితో భ‌ళ్లాళ‌దేవుడి స్క్రీన్ ప్ర‌జెన్స్ ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!

More Related Stories