English   

మహేష్ బాబుకు షాక్ ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్

Mahesh’s Maharshi entire Team Surprised by Devi Sri Prasad Work
2018-11-02 07:27:04

దేవీశ్రీ ప్రసాద్ అంటే ఇప్పుడు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్. రాక్ స్టార్ గా తిరుగులేని ఫామ్ తో ఉన్నాడు దేవీశ్రీ ప్రసాద్. కాకపోతే దేవీతో వచ్చిన సమస్య ఏంటంటే.. ట్యూన్స్ త్వరగా ఇవ్వడు. అలాగని బాగా లేట్ చేస్తాడని కాదు. బట్.. అనుకున్న వెంటనే రావు.. అనే టాక్ ఉంది. ఈ విషయంలో మహేష్ బాబు నటిస్తోన్న మహర్షి మూవీ టీమ్ కు మాత్రం ఓ స్ట్రాంగ్ షాక్ ఇచ్చాడట. దీంతో ఎంటైర్ టీమ్ దేవీ పనికి సర్ ప్రైజ్ అవుతున్నారు. మహేష్ బాబు ఈ మధ్య చేస్తోన్న సినిమాల్లో ఆ మూవీ థీమ్ ను ఎలివేట్ చేసేలా లేదంటే హీరో యాంబిషన్ ను ఎలివేట్ చేసేలా ఓ సాంగ్ ఉంటోంది. అలాంటి పాట మహర్షిలో కూడా ఉందట. ‘సాగిపోరా పోరా’ అంటూ సాగే ఈ పాటను ఆల్రెడీ అద్భుతంగా ట్యూన్ చేసి ఇచ్చాడట దేవీ శ్రీ ప్రసాద్. అంతే కాదు.. మూవీ ఆల్బమ్ మొత్తం ఇప్పటికే ఇచ్చేశాడట. అంటే ఆల్రెడీ ఆరు పాటలూ మ్యూజిక్ కంపోజ్ చేయడం పూర్తయింది. ఇక మిగిలింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే. మామూలుగా కాస్త లేట్ చేసే దేవీ శ్రీ ప్రసాద్ ఇలా వీళ్లు ఊహించకుండానే ముందే ఇచ్చేయడంతో ఎంటైర్ టీమ్ షాక్ అయిందట.

ఇక ప్రస్తుతం మహర్షి మూవీ షూటింగ్ యూఎస్ లో జరుగుతోంది. మహేష్ బాబు భిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడని ఇప్పటికే రిలీజ్ అయిన ఫోటోస్ తో తెలిసిపోతోంది. కాలేజ్ స్టూడెంట్ గా, ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేతగా కనిపిస్తాడట. అలాంటి ఓ రిచ్ క్యాండిడేట్ ఇండియాకు రావాల్సి వస్తుంది. అది కూడా తన ఫ్రెండ్(అల్లరి నరేష్) కోసం. అతని కోసం మహర్షి ఇండియాకు ఎందుకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు అనేది మిగతా కథ అంటున్నారు. ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి ఇది వ్యవసాయం ప్రధానంగా సాగే కథ అంటున్నారు.

వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ ఫ్రెండ్ గా అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇతర పాత్రల విషయాలు మాత్రం ఇప్పటి వరకూ పెద్దగా తెలియకుండా మెయిన్టేన్ చేస్తున్నారు. ఇక మహర్షి 2019 ఏప్రిల్ 5న ఉగాది సందర్భంగా విడుదల కాబోతోంది.

More Related Stories