English   

నాగ‌చైత‌న్య స‌వ్యసాచి ఓవ‌ర్సీస్ టాక్ వ‌చ్చేసింది

Naga Chaitanya’s Savyasachi Overseas Premier Shows Talk
2018-11-02 07:55:13

అక్క‌డ న‌వంబ‌ర్ 1 రాత్రే భారీగా ప్రీమియ‌ర్స్ ప‌డిపోయాయి. అక్క‌డ్నుంచి వ‌స్తున్న టాక్ ప్ర‌కారం సినిమా అబౌ యావ‌రేజ్ అని తెలుస్తుంది. తొలి 15 నిమిషాల సినిమా అద్భుతంగా మొద‌లు పెట్టాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. చందూ మొండేటి చాలా కొత్త క‌థ రాసుకోవ‌డం సినిమాకు బాగా క‌లిసొచ్చింది. ఆ త‌ర్వాత ఫ‌స్టాఫ్ అంతా కాస్త ఎంట‌ర్ టైనింగ్ గానే సాగింద‌ని.. అయితే కాలేజ్ సీన్స్ మాత్రం సినిమాకు పెద్ద‌గా క‌లిసి రాలేదంటున్నారు ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్. సెకండాఫ్ బాగుంద‌ని.. అయితే ఇంకాస్త రేసీగా సాగిపోయుంటే ఇంకా బాగుండేద‌ని ప్రేక్ష‌కుల అభిప్రాయం. ఫ‌స్టాఫ్ లో రెండు పాట‌లు చాలా బాగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు చందూ మొండేటి.

అయితే అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్న నిన్ను రోడ్డుమీద పాట అయితే ఊహించిన‌ట్లుగా లేద‌ని తెలుస్తుంది. ఇంట‌ర్వెల్ సీక్వెన్స్ చాలా బాగా డిజైన్ చేసిన ద‌ర్శ‌కుడు చందూ.. ఆ త‌ర్వాత క్లైమాక్స్ ను కూడా అంతే బాగా రాసుకున్నాడు. చైతూతో పాటు సినిమాలో మాధ‌వ‌న్ కూడా చాలా బాగా చేసాడ‌ని తెలుస్తుంది. ఈయ‌న ఎంట్రీ సినిమా రేంజ్ ను మార్చేస్తుందంటున్నారు ఆడియ‌న్స్. ఓవ‌రాల్ గా ఓవ‌ర్సీస్ టాక్ బ‌ట్టి చూస్తుంటే స‌వ్య‌సాచి కొత్త క‌థ‌తో వ‌చ్చింది.. అయితే ఇంకాస్త మంచి నెరేష‌న్ తో వ‌చ్చుంటే సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యేది కానీ అది లేక యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగిపోవాల్సి వ‌చ్చిందంటున్నారు యుఎస్ ప్రేక్ష‌కులు. మ‌రి మ‌న ద‌గ్గ‌ర ఆడియ‌న్స్ ఏమంటారో చూడాలిక‌.

More Related Stories