English   

స్టార్ హీరోలను కూడా భయపెట్టిన షకీలా పోర్న్ స్టార్ కాదట..!

Adult Movie Actress Shakeela Biopic Not A Porn Star
2018-11-02 11:55:32

షకీలా.. సౌత్ ను ఓ ఊపు ఊపేసిన అడల్ట్ మూవీ స్టార్. ప్రధానంగా మళయాల సినిమాల్లో నటించిన షకీలా తన మత్తైన సోయగాలు, చూపులతో తర్వాత దక్షిణాదితో పాటు నార్త్ నూ ఊపేసింది. ఒక దశలో తన సినిమా విడుదలవుతోందంటేనే ఎంటైర్ మాలీవుడ్ వణికిపోయేది. ఇంకా చెబితే షకీలా సినిమా రిలీజ్ అవుతుందంటే మమ్మూట్టి, మోహన్ లాల్ వంటి బిగ్గెస్ట్ స్టార్స్ కూడా తమ సినిమా రిలీజ్ డేట్స్ మార్చుకునే పరిస్థితి. ఆ రేంజ్ తనది. అలాంటి తనపై హీరోలు కక్ష కట్టారు. తన సినిమాలు అక్కడ లేకుండా చేశారు. దీంతో షకీలా ఆ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసింది. తర్వాత తెలుగులో తేజ డేర్ చేయడంతో ఇతర పాత్రలతో బిజీ అయింది. అయితే ప్రస్తుతం తన బయోపిక్ తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా షకీలా పాత్రలో నటిస్తోంది.

Shakeela Biopic Richa Chadha

షకీలా లైఫ్ లో జరిగిన ఎన్నో ఇన్సిడెంట్స్ ఈ మూవీలో చూపించబోతున్నారు. ఒకప్పుడు తను ఎంత గొప్ప లైఫ్ లీడ్ చేసింది. ఆ తర్వాత అయినవారి మోసాలతో.. తన వద్ద డబ్బును ఎలా లాక్కున్నారు.. ఒకప్పుడు మమ్మూట్టి, మోహన్ లాల్ వంటి స్టార్స్ నే భయపెట్టిన రేంజ్ ఉన్న షకీలా ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఎందుకు ఉంటోంది వంటి అంశాలు కూడా ఈ మూవీలో చూపించబోతున్నారు. ఇక సినిమాలో షకీలా కూడా ఓ గెస్ట్ రోల్ లో కనిపిస్తుందని రీసెంట్ గా చెప్పారు. మొత్తంగా ఓ మంచి కమర్షియల్ సినిమాకు ఏ మాత్రం తీసిపోని కథ షకీలాది. అంత వరకూ బానే ఉంది కానీ.. లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ విడుదల చేశారు. అందులో ‘షకీలా’ అనే టైటిల్ తో పాటు ‘నాట్ ఏ పోర్న్ స్టార్’ అనే క్యాప్షన్ ఉంది.

Shakeela Not A Porn Star First Look

నిజానికి ఇండియాలో పోర్న్ అనేదే లేదు. ఉన్నదంతా బి గ్రేడ్ మసాలాల వ్యవహారమే. పైగా షకీలాను ఎవరూ పోర్న్ స్టార్ అని ఇంత వరకూ సంబోధించలేదు. మహా అయితే బి గ్రేడ్ బ్యూటీ అన్నారు. అయినా వాళ్లు టైటిల్ లో ఇలా ఎందుకు పెట్టారనేది తెలియడం లేదు. ఏదేమైనా షకీలా సినిమా ఆమె లైఫ్ లా కాకుండా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.

More Related Stories