English   

తమన్ సెంచరీ కొట్టేశాడు

Thaman
2018-11-02 12:10:46

తెలుగు సినిమా పరిశ్రమలోకి సునామీలా వచ్చిన సంగీత దర్శకుడు తమన్. ఫస్ట్ మూవీతోనే ఆడియన్స్ కు అదిరిపోయే కిక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ కిక్ ఎంటైర్ ఇండస్ట్రీకి అంటించాడు. దీంతో అతి తక్కువ టైమ్ లోనే యాభై సినిమాలు పూర్తి చేసుకున్న సంగీత దర్శకుడుగా ఈ మధ్య కాలంలో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఆ వేగం మధ్యలో కొంత మందగించింది. మరోవైపు కాపీ క్యాట్ అన్న పేరు కూడా వచ్చింది. నిజానికి ఓ దశలో తమన్ పాటలు వింటే ఆల్రెడీ వందల సార్లు విన్నట్టుగా అనిపించేవి. అయినా అతనికి సినిమాలు రావడం ఆగలేదు. అతను సేమ్ ట్యూన్స్ వినిపించడం ఆపలేదు. తనకే కాదు.. పరిశ్రమకూ తెలియకుండానే ఇప్పుడు సెంచరీ కొట్టేశాడు. యస్.. తమన్ సంగీత దర్శకుడుగా వంద సినిమాలు పూర్తి చేసుకుని మొత్తం సౌత్ ఇండస్ట్రీనే సర్ ప్రైజ్ ఇచ్చాడు. అవును.. రీసెంట్ గా చేసిన అరవింద సమేత వీరరాఘవ సినిమాతో తమన్ వందో సినిమా పూర్తి చేసుకున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా ప్రకటిచాడు కూడా. 

తమన్ సంగీత దర్శకుడు కావడానికి ముందు డ్రమ్మర్, కీ బోర్డ్ ప్లేయర్. చిన్న వయసు నుంచే మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. అందుకు కారణం ఆయన ఫ్యామిలీ అంతా సంగీతకారులే. అందువల్ల చిన్నతనం నుంచే తమన్ కు సంగీత జ్ఞానం అబ్బింది. మొత్తంగా ఎంత నాణ్యమైన సంగీతాన్ని అందించాడు అనేది పక్కన బెడితే.. తమన్ చాలా తక్కువ టైమ్ లోనే సెంచరీ కొట్టిన సంగీత దర్శకుడుగా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక వరస చూస్తోంటే ఈ స్పీడ్ ఈజీగా డబుల్, త్రిపుల్ సెంచరీ వరకూ వెళ్లేలానే ఉంది. 

More Related Stories