English   

స‌వ్యసాచి రివ్యూ

Savyasachi-Review
2018-11-02 06:05:47

స‌వ్య‌సాచి.. అక్కినేని అభిమానుల‌తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఆస‌క్తిగా వేచి చూస్తున్న సినిమా ఇది. సాధార‌ణంగా నాగ‌చైత‌న్య సినిమాల‌పై ఉండే ఆస‌క్తి కంటే దీనిపై రెండింత‌లు ఉంది. మ‌రి ఈ న‌మ్మ‌కాన్ని చైతూ నిల‌బెట్టాడా..? 

క‌థ‌:

విక్ర‌మ్ ఆదిత్య‌(నాగ‌చైత‌న్య‌) ఒకే శ‌రీరంలో ఉన్న క‌వ‌ల‌లు. ఆదిత్య చేసే ప‌నుల‌తో విక్ర‌మ్ ఇబ్బందులు ప‌డుతుంటాడు. ఓ సారి పెద్ద యాక్సిడెంట్ నుంచి బ‌య‌ట ప‌డ‌తాడు విక్ర‌మ్. అయితే ఆ యాక్సిడెంట్ విక్ర‌మ్ మాత్ర‌మే మిగిలిపోయి 20 మంది చ‌నిపోతారు. కానీ అది యాక్సిడెంట్ కాదు మ‌ర్డ‌ర్ అని త‌ర్వాత తెలుస్తుంది. అయితే అదంతా ఏమీ తెలియ‌ని విక్ర‌మ్ హాయిగా లైఫ్ సాగిస్తుంటాడు. అత‌డి జీవితంలోకి చిత్ర‌(నిధి అగ‌ర్వాల్) వ‌స్తుంది. అంతా బాగుంది అనుకుంటున్న టైమ్ లో అరుణ్(మాధ‌వ‌న్) విక్ర‌మ్ లైఫ్ లోకి వ‌స్తాడు. అత‌డి బావ‌ను చంపేస్తాడు.. అక్క‌(భూమిక‌)ను గాయ‌ప‌రుస్తాడు. అక్క కూతుర్ని ఎత్తుకెళ్తాడు. అస‌లు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అనేది స‌వ్య‌సాచి క‌థ‌.. 

క‌థ‌నం:

చందూమొండేటి సినిమా అంటే ఎలా ఉంటుందో కార్తికేయ చూసిన‌పుడే అర్థ‌మైపోతుంది. స‌స్పెన్స్ కు కామెడీ తోడైతే ఫార్ములా సూప‌ర్ హిట్ అని ఆరోజే క‌నిపెట్టాడు చందూ. ఇప్పుడు కూడా దాదాపు ఇలాంటిదే చేసాడు చందూ. కాక‌పోతే ఈ సారి హార్ర‌ర్ కాకుండా కాస్త డిఫెరెంట్ జోన‌ర్ తీసుకున్నాడు చందూమొండేటి. అర్జునుడిలా రెండు చేతుల‌కు స‌మాన‌మైన బ‌లం ఉండే హీరో క‌థ ఇది. హీరోకు ఉన్న ఈ గుణాన్ని కామెడీ కోసం.. సీరియ‌స్ కోసం.. ఎమోష‌న్ కోసం ఇలా అన్ని ర‌సాల‌కు వాడేసుకున్నాడు. రంగ‌స్థ‌లంలో ఎలాగైనా చెవుడును సుకుమార్ అన్ని ర‌కాలుగా వాడుకున్నాడో చందూ కూడా ఇక్క‌డ ఇలాగే చేసాడు. ఫ‌స్టాఫ్ తొలి 15 నిమిషాల సినిమా అద్భుతంగా ఉంటుంది. ఆ 15 నిమిషాల్లోనే క‌థ అంతా చెప్పేసాడు ద‌ర్శ‌కుడు. ఆ త‌ర్వాత కూర్చోబెట్ట‌డం మొద‌లుపెట్టాడు. అయితే హీరోయిన్ తో ల‌వ్ ట్రాక్.. పాట‌లు కూడా ఊహించిన‌ట్లుగా రాలేదు. ఇక కామెడీ ట్రాక్ కూడా అక్క‌డ‌క్క‌డా పేలింది కానీ ఊహించినంత కాదు. 

సెకండాఫ్ లో సుబ‌భ్ర ప‌రిణ‌యం ఆక‌ట్టుకోలేదు. కేవ‌లం పాట కోసమే అక్క‌డ సీన్ ఇరికించాడు ద‌ర్శ‌కుడు చందూ. అయితే చైతూ అర్జునుడిగా బానే చేసాడు. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు అలా అలా వెళ్లిన క‌థ‌.. అక్క‌డ్నుంచి ఊహించ‌ని మ‌లుపు తీసుకుంటుంది. మ్యాడీ ఎంట్రీతో క‌థ స్వ‌రూప‌మే మారింది. ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాత అంతా ఆయ‌న కంట్రోల్లోకి వెళ్లిపోయింది. సెకండాఫ్ బాగా రాసుకున్నాడు చందూ. చైతూ, మ్యాడీ మ‌ధ్య వ‌చ్చే సీన్స్ అన్ని బాగా కుదిరాయి. అయితే ఇంకాస్త రేసీ స్క్రీన్ ప్లే ఉండుంటే సినిమా రేంజ్ మ‌రోలా ఉండేది. స‌వ్య‌సాచి అనే కాన్సెప్ట్ మాత్ర‌మే కొత్త‌గా అనిపించింది కానీ మిగిలిందంతా రొటీన్ అనిపిస్తుంది. అక్క‌డికీ బాగానే రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. కొత్త కథ కావ‌డంతో స‌వ్య‌సాచి పాస్ అయిపోతాడు కానీ ఇదే రొటీన్ క‌థ అయ్యుంటే క‌చ్చితంగా బోర్ కొట్టించేవాడే. క్లైమాక్స్ బాగా రాసుకున్నాడు చందూమొండేటి. చైతూ కూడా స‌వ్య‌సాచిగా పూర్తిస్థాయి న్యాయం చేసాడు. 

న‌టీన‌టులు:

నాగ‌చైత‌న్య న‌టుడిగా సినిమా సినిమాకు రాటుదేలుతున్నాడు. ఒక‌ప్పుడు ఈయ‌న న‌ట‌న‌పై చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చేవి. కానీ ఇప్పుడు అవి లేకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. స‌వ్య‌సాచిలో న‌టుడిగా మ‌రింత అద్భుతంగా చేసాడు చైతూ. ముఖ్యంగా కొన్ని ఎమోష‌న‌ల్ సీన్స్ లో చాలా బాగా న‌టించాడు చైతూ. ఇక మాధవ‌న్ సినిమాకు ప్రాణం పోసాడు. ఈయ‌న ఒప్పుకోవ‌డ‌మే సినిమా విజ‌యం అని చందూ అన్నాడు కానీ ఆయ‌న పాత్ర‌ను ఇంకాస్త రాసుంటే బాగుండేది. క్లైమాక్స్ లో మ‌రీ తేల్చేసాడు. నిధి అగ‌ర్వాల్ పాట‌ల‌కు ప‌నికొచ్చింది.. అందాల‌తో మురిపించింది. భూమిక చావ్లా కీల‌క‌మైన పాత్ర‌లో మెప్పించింది. వెన్నెల కిషోర్, స‌త్య‌, వైవా హ‌ర్ష గ్యాంగ్ కామెడీ అక్క‌డ‌క్క‌డా పేలింది. 

టెక్నిక‌ల్ టీం: 

కీర‌వాణి సంగీతం స‌వ్య‌సాచికి అతిపెద్ద ప్ల‌స్. పాట‌ల విష‌యంలో పెద్ద‌గా ఆక‌ట్టుకోక‌పోయినా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ మ‌రో స్థాయిలో ఉంది. అది వ‌చ్చిన‌పుడు తెలియ‌కుండానే గూస్ బంప్స్ తెప్పించాడు కీర‌వాణి. ఇక సినిమాటోగ్ర‌ఫ‌ర్ యువ‌రాజ్ ప‌ని తీరు కూడా బాగుంది. ఎడిటింగ్ కాస్త వీక్ అనిపిస్తుంది. అక్క‌డ‌క్క‌డా కొన్ని సీన్స్ బోర్ కొట్టించారు. రెండున్న‌ర గంట‌ల సినిమా కావ‌డంతో బోర్ కొట్టింది. ద‌ర్శ‌కుడిగా చందూమొండేటి టాలెంట్ సూప‌ర్. క‌థ‌కుడిగా కూడా చాలా బాగా రాసుకున్నాడు. అయితే స్క్రీన్ ప్లే విష‌యంలోనే ఇంకాస్త జోరు ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. ఇలాంటి క‌థ‌కు ఇంత కంటే ఫాస్ట్ స్క్రీన్ ప్లే రాసుకోవ‌చ్చ‌నేది ప్రేక్ష‌కుల అభిప్రాయం. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాణానికి పేరు పెట్టాల్సిన ప‌నిలేదు. 

చివ‌ర‌గా: స‌వ్య‌సాచి.. కాన్సెప్ట్ ఒక్క‌టే కొత్త‌ది.. మిగిలిందంతా సేమ్ టూ సేమ్.. 

రేటింగ్:  2.75/5

More Related Stories