English   

ఓర్నీ.. ఆ హీరోయిన్ కు నిజంగానే సీట్ ఇచ్చారు..?

Reshma-Rathore
2018-11-02 19:07:30

ఈ రోజుల్లో అనే సినిమాతో ఆకట్టుకున్న బ్యూటీ రేష్మ రాథోడ్. ఈ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో టాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ మారుతి. తర్వాత ఈ మూవీ ట్రెండ్ కొన్నాళ్ల పాటు కంటిన్యూ అయింది. తర్వాత రేష్మకు చాలా ఆఫర్స్ వచ్చాయి. బ్యాడ్ లక్.. అవేవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఓ మోస్తరు హీరోయిన్ గా అయినా నిలబడుతుంది అనుకుంటే అమ్మడు అది కూడా సాధించలేకపోయింది. ఓ దశలో కోలీవుడ్ కు వెళ్లే ప్రయత్నమూ చేసింది. అవీ వర్కవుట్ అయినట్టు లేవు. ఉదయ్ కిరణ్ తో శ్రీరామ్ అనే సినిమాలోనూ నటించిన ఈ భామను తర్వాత టాలీవుడ్ పూర్తిగా పక్కన బెట్టింది. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన రేష్మ సినిమా ఆఫర్స్ లేవని ఎప్పుడూ బాధపడ్డట్టు కనిపించదు. కానీ సడెన్ గా కొన్నాళ్ల క్రితం పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు చేసింది. ఊహించినట్టుగానే తను పొలిటీషియన్ గా మారింది. 

ఎస్. టి సామాజిక వర్గానికి చెందిన రేష్మ మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నట్టు ఆ మధ్య ప్రకటించింది. టిఆర్ఎస్ టికెట్ ఇస్తే నేను రెడీ అనే సంకేతాలూ ఇచ్చింది. కానీ అప్పట్లో అమ్మడి కమెంట్స్ ను కామెడీగా తీసుకున్నారంతా. బట్ లేటెస్ట్ గా తను బిజెపి గూటికి చేరింది. అనూహ్యంగా తనకు ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించింది బిజెపి. ఈ మేరకు ఈమె వైరా అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది కూడా. డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతున్నాయి. మరి అమ్మడి అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి. 

More Related Stories