English   

బ‌న్నీ కాద‌న్నాడు.. నాని ర‌మ్మ‌న్నాడు.. 

Nani
2018-11-02 19:17:05

చూస్తుంటే ఇప్పుడు ఇదే జ‌రిగేలా క‌నిపిస్తుంది ఇండ‌స్ట్రీలో. ఇక్క‌డ ఓ హీరో కోసం అనుకున్న క‌థ‌లో మ‌రో హీరో న‌టించ‌డం చాలా కామ‌న్. ఇప్పుడు కూడా ఇదే జ‌ర‌గ‌బోతుంద‌ని తెలుస్తుంది. బ‌న్నీ కోసం రాసుకున్న క‌థ‌లోకి నాని వ‌స్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అస‌లు విష‌యం ఏంటంటే ఇప్పుడు విక్ర‌మ్ కే కుమార్ తో నాని సినిమా చేయ‌బోతున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మూడేళ్లుగా మ‌నోడి అదృష్టం బాగుండి యావ‌రేజ్ సినిమాలు కూడా ఆడేసాయి. కానీ కృష్ణార్జున యుద్ధం.. దేవ‌దాస్ త‌ర్వాత నానికి కూడా బ్యాడ్ టైమ్ అంటే ఏంటో తెలిసింది. అందుకే ఇప్పుడు క‌థ‌ల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నాడు. ప్ర‌స్తుతం కిషోర్ జెర్సీ సినిమాతో బిజీగా ఉన్న నాని.. ఇప్ప‌టికే కిషోర్ తిరుమ‌ల‌, హ‌ను రాఘ‌వ‌పూడిల‌తో చేయాల్సిన సినిమాల‌ను అనుకోని కార‌ణాల‌తో వ‌దిలేసుకున్నాడు.

 ఇక ఇప్పుడు జెర్సీ త‌ర్వాత ఈయ‌న చేయ‌బోయే సినిమాపై అంద‌ర్లోనూ ఆస‌క్తి ఉంది. దీనికి స‌మాధానం వ‌చ్చేసింది. అది విక్ర‌మ్ కే కుమార్ అని తెలుస్తుంది. ఈయ‌న సినిమానే చేయ‌డానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. విక్ర‌మ్ సినిమా అంటే డిఫెరెంట్ గా ఉంటుంద‌ని ప్రేక్ష‌కుల్లో న‌మ్మ‌కం ఉంది. మ‌నం కానీ.. హ‌లో కానీ.. ఇష్క్ కానీ.. 24 కానీ.. ఏ సినిమాకు అదే భిన్నం. ఫ‌లితం ప‌క్క‌న‌బెడితే విక్ర‌మ్ సినిమా అంటే భిన్నం అని అర్థం. అందుకే ఆయ‌న‌తో సినిమా కోసం స్టార్ హీరోలు కూడా పోటీలో ఉంటారు. ఇప్పుడు ఈ అవ‌కాశం నానికి వ‌చ్చింది. పైగా బ‌న్నీతో చేయాల్సిన క‌థ‌నే ఇప్పుడు నానితో విక్ర‌మ్ చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. చివ‌రి వ‌ర‌కు చేస్తాన‌ని చెప్పి.. విక్ర‌మ్ ను కాద‌ని త్రివిక్ర‌మ్ తో క‌నెక్ట్ అయ్యాడు బ‌న్నీ. దాంతో విక్ర‌మ్ వ‌చ్చేసి నానిని చూసుకున్నాడు. మ‌రి ఈ ఇద్ద‌రూ క‌లిసి ఎలాంటి సంచ‌ల‌నం సృష్టిస్తార‌నేది చూడాలిక‌. 

More Related Stories