English   

అమితాబ్ కు తంటాలు తెచ్చిన ఎవ‌రెస్ట్

Amitabh Bachchan Received legal notice for wearing lawyer's attire in Everest Masala ad
2018-11-03 09:03:47

ఎవ‌రెస్ట్ ఏం చేసింది అమితాబ్ బ‌చ్చ‌న్ ను.. అయినా ఆయ‌న‌కేం సంబంధం దాంతో అనుకుంటున్నారా..? ఏం చేస్తాం అస‌లే ఈ మ‌ధ్య పెద్దాయ‌న టైమ్ ఏం అంత బాగోలేదు. ఆ మ‌ధ్య ఏదో యాడ్ చేస్తే అందులో న‌టించినందుకు గానూ బ్యాంక్ వాళ్ల మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయి. అందుకే న‌గ‌ల యాడ్ మొత్తం అన్ని భాష‌ల్లోనూ తీసేసారు. నాగార్జున‌కు కూడా ఈ తిప్ప‌లు త‌ప్ప‌లేదు. ఇక ఇప్పుడు మ‌రో యాడ్ నుంచి అమితాబ్ బ‌చ్చ‌న్ కు తిప్ప‌లు త‌ప్ప‌లేదు. ఈయ‌న నటించిన ఎవరెస్ట్ మసాలా యాడ్ పై ఢిల్లీ బార్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎవ‌రి అనుమ‌తితో ఇందులో న‌ల్ల కోర్ట్ వేసుకున్నారంటూ బిగ్ బిపై మండి ప‌డింది. అస‌లు అనుమతి లేకుండా లాయర్ కోట్ వినియోగించడం నేరం.. అందుకే ఇప్పుడు బార్ కౌన్సిల్ అమితాబ్ తో పాటు ఎవరెస్ట్ మసాలా నిర్వాహకులకు, యూట్యూబ్ ఛానెల్ కి, ఓ మీడియా సంస్థకి కూడా లీగల్ నోటీసులు పంపించారు. 10 రోజుల్లో దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని లేదంటే లీగ‌ల్ గా అంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. అంతేకాదు ఈ యాడ్ వెంట‌నే ఆపేయాల‌ని ఆదేశించారు. మొత్తానికి ఎవ‌రెస్ట్ మ‌సాలా మంట న‌షాలానికి ఎక్క‌డం అంటే ఇదే.

More Related Stories