English   

రవితేజకు ప్రాబ్లమ్స్ తెచ్చిన నాగచైతన్య

Ravi-Teja
2018-11-03 12:47:27

అసలే బజ్ లేక ఇబ్బంది పడుతోన్న సినిమాకు రిలీజ్ కు ముందే డిజాస్టర్ టాక్ వచ్చిట్టుగా ఉంది మాస్ రవితేజ సినిమా పరిస్థితి. అతని లేటెస్ట్ మూవీ అమర్ అక్బర్ ఆంటోనీకి ఇప్పుడు నాగచైతన్య కొత్త కష్టాలు తెచ్చాడు. ఇప్పటికే ప్రాబ్లమ్స్ లో ఉన్న అమర్ అక్బర్ ఆంటోనీకి ఈ ఎఫెక్ట్ మరింత దారుణంగా పడబోతోంది. దీంతో ఈ సమస్యను ఎలా ఫేస్ చేయాలా అని సదరు చిత్ర నిర్మాతలు తెగ హైరానా పడిపోతున్నారు. తెలుగులోకి బ్లాక్ బస్టర్స్ తో  ఎంట్రీ ఇచ్చింది మైత్రీ మూవీస్ సంస్థ. వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోన్న ఆ బ్యానర్ కు సవ్యసాచి రూపంలో ఫస్ట్ డిజాస్టర్ ఎదురైంది. ఏ వర్గాన్ని కూడా ఆకట్టుకోలేకి కథ, కథనాలతో సవ్యసాచి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఇదే ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన అమర్ అక్బర్ ఆంటోనీపై ఆ ఎఫెక్ట్ దారుణంగా పడిపోయింది. 

ప్రస్తుతం రవితేజ, దర్శకుడు శ్రీను వైట్ల వరుస డిజాస్టర్స్ తో ఉన్నారిప్పుడు. అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన హిట్స్ తో పనిలేకుండా వీరి సినిమాపై ఏ అంచనాలూ లేవు. అందుకు తగ్గట్టుగానే టీజర్ కూడా ఉండటంతో మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతోన్న ఈ మూవీకి ఇప్పటికే బయ్యర్స్ లేరు. ఏం చేసినా ఇప్పుడప్పుడే బజ్ వచ్చేలా లేదు. పోనీ ప్రొడక్షన్ హౌస్ ను చూసి కొనడానికి వచ్చేవాళ్లకు సవ్యసాచి చెక్ పెట్టింది. దీంతో రవితేజ సినిమాకుు మరిన్ని ప్రాబ్లమ్స్ వచ్చేశాయి. మరి ఈ సమస్య నుంచి మైత్రీ మూవీస్ సంస్థ ఎలా బయటపడుతుందో కానీ... అమర్ అక్బర్ ఆంటోనీకి బిగ్గెస్ట్ హిట్ టాక్ వస్తే కానీ.. ప్రాజెక్ట్ సేఫ్ గా మారదు.

More Related Stories