English   

నువ్వే నా ధైర్యం.. రాజ‌మౌళితో శంక‌ర్ క‌మెంట్స్.. 

Shankar
2018-11-03 16:33:26

రాజ‌మౌళి.. శంక‌ర్.. ఇద్ద‌రూ ఇద్ద‌రే.. ఒక‌రు తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చూపిస్తే.. మ‌రొక‌రు త‌మిళ్ సినిమా రేంజ్ చూపించారు. అయితే ఇప్పుడు ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఇండియ‌న్ సినిమా స్థాయేంటో చూపిస్తున్నారు. వీళ్ల మ‌ధ్య పోరు కూడా ఆరోగ్య‌కరంగానే ఉంటుంద‌ని వాళ్ల మాట‌ల్లో తెలుస్తుంది. ఇప్పుడు 2.0 ట్రైల‌ర్ లాంచ్ లో రాజ‌మౌళి ఓ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌ను శంక‌ర్ కు అడిగాడు. 500 కోట్లు పెట్టి సినిమా చేసిన‌పుడు ఎలా మీరు ఒత్తిడిని జ‌యిస్తారు అంటూ అడిగాడు. దానికి ఆయ‌న కూడా చాలా హూందాగా స‌మాధానం ఇచ్చాడు. రాజ‌మౌళి గారు మీరంటే నాకు చాలా ఇష్టం.. అలాగే నేను మీ ఫ్యాన్ అన్నాడు శంక‌ర్. 

అంత పెద్ద ద‌ర్శ‌క‌డు అయి ఉండి కూడా మ‌రో ద‌ర్శ‌కుడికి తాను ఫ్యాన్ అని చెప్పుకోవ‌డం నిజంగా గొప్ప విష‌య‌మే. పైగా రాజ‌మౌళి కంటే ముందే శంక‌ర్ స్టార్ డైరెక్ట‌ర్. ఇండియ‌న్ సినిమాకు సౌత్ స‌త్తా చూపించిన ద‌ర్శ‌కుడు. అలాంటి ద‌ర్శ‌క దిగ్గ‌జం ఎలాంటి బేష‌జాలు లేకుండా రాజ‌మౌళికి ఫ్యాన్ అని చెప్పుకోవ‌డం గొప్పే. ఇక ప్రెజ‌ర్ ఎలా హ్యాండిల్ చేస్తానంటే నేను క‌ష్ట‌ప‌డ‌తాను రాజ‌మౌళి గారు.. అదే నా బ‌లం అని చెప్పాడు శంక‌ర్. అంతేకాదు.. మీ లాంటి ద‌ర్శ‌కులు ఇండియ‌న్ సినిమాకు గ‌ర్వ‌కార‌ణం అంటూ జ‌క్క‌న‌ను తెగ పొగిడేసాడు శంక‌ర్. మొత్తానికి ఈ ఇద్ద‌రి పొగ‌డ్త‌ల‌తో 2.0 ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ మ‌రింత ప్ర‌త్యేకంగా మారింది.

More Related Stories