English   

రజినీకాంత్ ఎంత మాటనేశాడు..?

Rajinikanth
2018-11-03 17:39:17

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇండియన్ సినిమాలో తిరుగులేని క్రేజ్ ఉన్న స్టార్. ఇంత స్టార్డమ్ ఉన్నా డౌన్ ఎర్త్ ఉన్న నటుడుగానూ ఆయన మాత్రమే కీర్తిని సంపాదించుకున్నారు. అందుకే ఏ భాషలో స్టార్ అయినా సూపర్ స్టార్ అంటే ఇష్టపడతారు. సౌత్ ఇండియా నుంచి వాల్డ్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న ఫస్ట్ స్టార్ కూడా సూపర్ స్టారే అనేది కాదనలేని సత్యం. అలాంటి రజినీకాంత్ లేటెస్ట్ గా 2.0 మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాయి. అందుకే కదా రజినీని సూపర్ స్టార్ అనేది అని మరోసారి అంతా అనుకునేలా మాట్లాడాడాయన. ప్రస్తుతం రజినీ వయసు పరంగా మరీ పూర్వకాలం నాటి స్టంట్స్ చేసే అవకాశం అస్సల్లేదు. అయినా ఆయన స్టార్డమ్ కు క్రేజ్ కు వయసు ఎప్పుడూ అడ్డంకిగా లేదు. బట్.. ఫస్ట్ టైమ్ ఈ విషయాన్ని పబ్లిక్ గా చెప్పాడు రజినీకాంత్. 

తను ఈ సినిమా చేస్తున్నప్పుడు ఏకంగా పది పదిహేను కిలోల బరువున్న కాస్ట్యూమ్స్ తో షూటింగ్ చేయాల్సి వచ్చేదనీ.. పైగా టూడీ, త్రీడీ వెర్షన్స్ కావడంతో ఒక్కో షాట్ చాలాసార్లు తీయాల్సి వచ్చేదట. దీంతో అంత బరువు మోస్తూ షూటింగ్ చేయడం తనవల్ల కాదని ఈ సినిమా నుంచి తప్పుకుంటానని శంకర్ కు చెప్పాడట. బట్ శంకర్ మాత్రం మీరే చేయాలంటూ పట్టుబట్టి ఈ సినిమా చేయించాడని చెప్పుకొచ్చాడు. ఇంత వరకూ బానే ఉన్నా..ఆ తర్వాత ఆయన చెప్పిన మాటకు మాత్రం దటీజ్ రజినీకాంత్ అనకుండా ఉండలేం.

‘ఈ సినిమాకు అయిన బడ్జెట్ 600కోట్లు. కానీ ఈ బడ్జెట్ ను నిర్మాత నన్నో, అక్షయ్ కుమార్ ను చూసో పెట్టలేదు. కేవలం  శంకర్ ను నమ్మి మాత్రమే అంత బడ్జెట్ పెట్టాడు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక తనకు రోబో, 2.0 వంటి మూవీస్ ఇచ్చిన శంకర్ ను ఇండియన్ స్పీల్ బర్గ్ అంటూ ఆకాశానికెత్తేశాడు రజినీ. ఏదేమైనా ఓ సూపర్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ ఉన్న రజినీ దర్శకుడికి ఇచ్చిన ఇంపార్టెన్స్ చూసి ఈ తరం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. 

More Related Stories