English   

రామ్ గోపాల్ వర్మ కొత్త రక్త చరిత్ర 

Bhairava-Geetha
2018-11-03 18:40:03

రామ్ గోపాల్ వర్మ కథ అందించిన సినిమా భైరవగీత. కన్నడలో రూపొందిన ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు అదే టైటిల్ తో. ఆ మధ్య విడుదల చేసిన ట్రైలర్ తో సూపర్ అనిపించుకున్నాడు వర్మ. సిద్ధార్థ్ తాతోలు డైరెక్ట్ చేసిన ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ నెల 22న సినిమా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ రెండో ట్రైలర్ కు సంబంధించి మాట్లాడుకునేముందు కాస్త వెనక్కి వెళితే బెటర్. కొన్నాళ్ల క్రితం గోపీచంద్ హీరోగా రీ బ్యాక్ అయిన సినిమా ‘యజ్ఞం’ గుర్తుందా.. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ చేతిలో కీలు బొమ్మలా మారిన యువకుడు.. ఆ ఫ్యాక్షనిస్ట్ కూతురుతోనే ప్రేమలో పడతాడు. ఆమెను తీసుకుని ఇంట్లోనుంచి పారిపోతాడు. అప్పటి వరకూ సొంత మనిషిలా చూసిన వాడు తన కూతురును ప్రేమించాడనేసరికి శతృవుతో చేతులు కలిపి వీడిని చంపేయాలనుకుంటాడు.. ఫైనల్ గా విలనే హతమవుతాడనుకోండి.. కట్ చేస్తే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా అదే కథను తనదైన శైలిలో వండినట్టు ఈ రెండో ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. 

తాతలు, తండ్రుల నుంచి ఫ్యాక్షనిస్ట్ ఏం చెబితే అదే చేసుకుంటూ వెళ్లే భైరవ అనే వ్యక్తి.. ఆ ఫ్యాక్షనిస్ట్ కూతురు గీత ప్రేమలో పడతారు. పారిపోతారు. వారిని వెదుకుతూ వెళ్లే విలన్.. ఇదే తరహాలో ఉందీ ట్రైలర్. కాకపోతే వర్మ మార్క్ టేకింగ్ అద్భుతంగా కనిపిస్తోంది. అలాగే ట్రెండ్ ను బట్టి గట్టి మసాలా కూడా దట్టించినట్టుగా అర్థమౌతోంది. ఈ ట్రైలర్ లో వినిపించిన ‘నువ్వే నా భగవద్గీత’ అనే పాట హైలెట్ గా ఉంది. మొత్తంగా వర్మ మార్క్ రక్త చరిత్రతో నిండిపోయిందీ ట్రైలర్. 

కన్నడలో హీరోగా ట్రై చేసి సక్సెస్ లేక విలన్ గా మారిన ధనుంజయ ఈ సినిమాతో మళ్లీ హీరోగా ట్రై చేస్తున్నాడు. ఐరామోర్ హీరోయిన్ గా నటించింది. ఇతర పాత్రలు కూడా మనకు తెలిసిన మొహాలు ఏం లేవు. బట్ హీరోకు చెప్పిన డబ్బింగ్ మాత్రం దారుణంగా ఉంది. అది కాస్త సరిచేసుకుని నేటివిటీకి దగ్గరగా ఉండేలా చూసుకుంటే ఇప్పటికైనా బెటర్.  మొత్తంగా ‘యజ్ఞం’ మార్క్ లో సాగే రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్రలా ఉందీ ట్రైలర్. 

More Related Stories