English   

విజువల్ గ్రాండ్ ఓకే.. విషయమేదీ శంకర్

Rajinikanth-2.0
2018-11-03 20:03:16

శంకర్, రజినీకాంత్, అక్షయ్ కుమార్.. ఓ సినిమాకు బిగ్గెస్ట్ సౌండ్ వినిపించడానికి ఇంతకు మించిన పేర్లు ఇంకేముంటాయి. సౌత్ ను నార్త్ ను మిక్స్ చేస్తూ శంకర్ తెరకెక్కించిన 2.0 ట్రైలర్ విడుదలైంది. ముందు నుంచీ అందరూ ఊహించినట్టుగానే అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. విజువల్ గ్రాండీయర్ ఉంది. ఓ హాలీవుడ్ సినిమా రేంజ్ కు ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఉంది. కానీ ట్రైలర్ ఆసాంతం అవే తప్ప అసలు కంటెంట్ ఏంటీ అనే విషయం పై ఏ మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఒకవేల మొబైల్ ఫోన్స్ రాబోయే కాలంలో మనకు శతృవులుగా మారబోతున్నాయి అనే విషయం చెప్పాలనుకున్నా.. అది ఆల్రెడీ గతంలోనే టీజర్ లో చెప్పేశారు. దీంతో ఇందులో కంటెంట్ గురించి ఏమీ చూపించలేదనే చెప్పాలి. 

అయితే ఒక రకంగా ఇది రోబో కు సీక్వెల్ కాదని ముందు నుంచీ చెబుతూ వస్తున్నారు. బట్.. ఓ దుష్టశక్తి ప్రపంచంపైకి దాడి చేస్తే.. దాన్ని ఎదుర్కొనడానికి మరో సూపర్ పవర్ క్రియేట్ కావాలి. అలా ఆల్రెడీ క్రియేట్ అయిన డిస్మాటిల్ అయిన రోబో నే రీ క్రియేట్ చేశాడు శంకర్. అంటే ఇది సీక్వెల్ కాకుండా పోదు కదా. టెక్నికల్ గా శంకర్ ఎంత బ్రిలియంట్ అనేదానికి అచ్చమైన రూపంగా ఈ ట్రైలర్ కనిపిస్తోంది కానీ.. కంటెంట్ పరంగా అతని బలాన్ని కూడా చూపించలేదనేది నిజం. మరి కావాలనే కంటెంట్ దాచారా లేక.. విజువల్ గ్రాండీయర్ గా మాత్రమే 2.0ను చూపించబోతున్నారా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు. మొత్తంగా ఎన్నాళ్లో వేచిన ట్రైలర్ వచ్చేసింది. ఇక ఆ సినిమా కూడా వచ్చేస్తే.. 2.0 కు సంబంధించిన డిస్కషన్స్ కు ఓ ఫుల్ స్టాప్ పడుతుంది.                       
 

More Related Stories