English   

డ‌బ్బులే లేవంటాడు.. మ‌రి ప‌వ‌న్ ఎలా నెం 1..?

Pawan-Kalyan
2018-12-06 10:00:22

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎప్పుడు అడిగినా కూడా త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌ని.. సినిమాలు చేస్తే కానీ డ‌బ్బులు రావ‌ని చెబుతూ ఉంటాడు. త‌న ద‌గ్గ‌ర కూడ బెట్టిన ఆస్తులు కూడా లేవ‌ని చెబుతుంటాడు. కానీ ఇప్పుడు ఫోర్బ్స్ లిస్ట్ లో తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి అత్య‌ధికంగా సంపాదించేది ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని బ‌య‌ట‌ప‌డింది. ఈయ‌న ఏడాది సంపాద‌న అక్ష‌రాలా 31 కోట్లు. తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి టాప్ లో నిలిచింది ఈయ‌నే. ఈయ‌న త‌ర్వాతే వ‌ర‌స‌గా సినిమాలు చేసే మ‌హేష్ బాబు.. రామ్ చ‌ర‌ణ్.. విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి హీరోలు కూడా ఉన్నారు. అస‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలే చేయ‌డు మ‌రి ఇంత డ‌బ్బు ఎక్క‌డ్నుంచి వ‌చ్చింది అనేది మాత్రం స‌స్పెన్స్. పోనీ ఇప్పుడు సినిమాలు ఏమైనా ఒప్పుకున్నాడా అంటే అదీ లేదు. అజ్ఞాత‌వాసి త‌ర్వాత పూర్తిగా సినిమాలు వ‌దిలేసి రాజ‌కీయాల‌తోనే బిజీగా ఉన్నాడు ప‌వ‌ర్ స్టార్. ఇదిలా ఉంటే ఇప్పుడు ప‌వ‌న్ నెంబ‌ర్ వ‌న్ శ్రీ‌మంతుడు కావ‌డం మాత్రం నిజంగానే ఆశ్చ‌ర్య‌మే. అస‌లు ఈయ‌న‌కు ఇన్ని కోట్లు ఎక్క‌డ్నుంచి వ‌స్తున్నాయ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. పోనీ ఈ స‌ర్వే అబ‌ద్ధం అన‌డానికి కూడా లేదు. అన్నీ ప‌క్కాగా చెక్ చేసుకున్న త‌ర్వాత కానీ బ‌య‌టికి విడుద‌ల చేయ‌రు. ఇప్పుడు ఈ లెక్క‌న తెలుగులో శ్రీ‌మంతుడు ప‌వ‌ర్ స్టారే. ఈయ‌న త‌ర్వాత ఎన్టీఆర్ 28 కోట్ల‌తో 28వ స్థానంలో ఉన్నాడు. ఆ త‌ర్వాత నాగార్జున‌, రామ్ చ‌ర‌ణ్, కొర‌టాల శివ‌, అల్లు అర్జున్, విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి వాళ్లు కూడా ఉన్నారు. ఏదేమైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ టాప్ లో ఉన్నాడంటే వ‌చ్చే కిక్కే వేర‌బ్బా. 

More Related Stories