English   

సాహోను కొట్టే మొనగాడు లేనట్లేనా.. ఇప్పటికీ ప్రభాస్ నెంబర్ 1.. 

Saaho teaser
2019-08-23 17:33:17

బాహుబలితోనే కొత్త చరిత్రకు నాందీ పలికాడు ప్రభాస్. అయితే ఆ సినిమాలో రాజమౌళి భాగం అయ్యాడు కాబట్టి క్రేజ్ అంతా ఆయనకే వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు ఈయన సాహో సినిమాతో వస్తున్నాడు. ఇది కానీ సంచలనం రేపిందంటే ప్రభాస్ నెంబర్ వన్ అయిపోయినట్లే. ఇదిలా ఉంటే విడుదలకు ముందే తన సత్తా చూపిస్తున్నాడు ఈయన. ముఖ్యంగా సాహో ట్రైలర్ అయితే దుమ్ము దులిపేస్తుంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో వస్తుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియోస్, సాంగ్స్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో సాహోను కొట్టే మొనగాడే కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా టీజర్, ట్రైలర్ విషయంలో అందనంత ఎత్తులో ఉన్నాడు ప్రభాస్. సైరా వచ్చినా కూడా సాహోను కదిలించలేదు. చిరంజీవి సైతం ఇప్పుడు ప్రభాస్ తర్వాతే ఉన్నాడు. మొన్నటికి మొన్న బ్యాడ్ బాయ్ సాంగ్ ఏకంగా ప్రపంచంలోనే నెంబర్ వన్ అయిపోయింది. ట్రెండింగ్ లో నడుస్తుంది.. ఇక ఇప్పుడు సాహో టీజర్ కూడా ప్రకంపనలు సాగుతూనే ఉన్నాయి. ఈ టీజర్ 24 గంటలు పూర్తయ్యే సరికి ఒక్క తెలుగు వెర్షన్ లోనే మొత్తం 4 లక్షల 55వేలు లైక్స్ సంపాదించుకుంది. ఇప్పటివరకు ఏ సినిమా టీజర్ కూడా ఈ స్థాయిలో లైక్స్ అందుకోలేదు. ఇప్పటి వరకు నెంబర్ వన్ సాహోనే.. మరి దీన్ని దాటే సినిమా ఎక్కడ ఎప్పుడు వస్తుందో చూడాలి.

More Related Stories