English   

స్టూడెంట్ నెం 1 రోజులను గుర్తు చేసుకున్న రాజమౌళి..

18 years StudentNo1
2019-09-27 17:15:53

ఎస్ఎస్ రాజమౌళి.. ఈ రోజు ఈ పేరుకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఇండియాలో ఈయన్ని మించిన దర్శకుడు లేడు. బాహుబలితో దేశవ్యాప్తంగా రికార్డుల పర్వానికి తెరతీసాడు ఈయన. ఇలాంటి దర్శకుడి మూలాలు స్టూడెంట్ నెం 1 దగ్గర ఉన్నాయి. 2001లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షించారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ చిత్రం వచ్చింది. అప్పట్లో స్టూడెంట్ నెం 1 సంచలన విజయం సాధించింది. ఈ సినిమా విడుదలై 18 ఏళ్లు గడిచిపోయాయి. 2001 సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఎన్టీఆర్ కు సోలో హీరోగా గుర్తింపు తీసుకొచ్చింది. ఇదే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకున్నారు రాజమౌళి, ఎన్టీఆర్. యాదృశ్చికంగా అప్పుడు ఆ సినిమాను ఆర్ఎఫ్సీలో షూట్ చేసామని.. ఇప్పుడు కూడా RRR షూటింగ్ ఇక్కడే జరుగుతుందని రాజమౌళి పోస్ట్ చేసాడు. అప్పుడు ఉన్న షూటింగ్ స్టిల్స్.. ఇప్పుడు మరోసారి రీ క్రియేట్ చేసి అభిమానుల కోసం పోస్ట్ చేసాడు ఎన్టీఆర్. అలాగే రాజమౌళి కూడా తను ఎన్టీఆర్ కు స్క్రిప్ట్ వివరిస్తుండగా తీసిన ఫోటోలను ఇప్పుడు షేర్ చేసాడు దర్శక ధీరుడు. అప్పుడు ఇప్పుడు అదే పోజ్ పెట్టి ఉన్న ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

More Related Stories