English   

ట్రెండింగ్ లో బాస్ నంబర్ 1..భక్తుడు నంబర్ 2

Bandla Ganesh Pawan kalayn
2021-04-06 15:36:28

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఏ రేంజ్ లో అభిమానులు ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు ఎంద‌రో ఉన్నారు. అయితే ప్ర‌జ‌ల అభిమానాన్ని ఎంద‌రో హీరోలు పొందుతారు. కానీ సెల‌బ్రెటీలు సైతం అభిమానించేలా ఎదిగిన‌ హీరోలు కొంత‌మందే ఉంటారు. వారిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఒక‌రు. 

ఇప్ప‌టికే ప‌లువురు టాలీవుడ్ సెలబ్రెటీలు త‌మ అభిమాన హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల్లో న‌టుడు నిర్మాత బండ్ల గ‌ణేష్ కూడా ఒక‌రు. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాను నిర్మించిన బండ్ల గ‌ణేష్ ప‌వ‌న్  క‌ల్యాణ్ నా దేవుడ‌ని అంటారు. ఇప్ప‌టికే ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో ప‌వ‌న్ పై అభిమానాన్ని చాటుకున్నారు బండ్ల‌గ‌ణేష్. ఇక సినిమా ఫంక్ష‌న్ల‌లో మైక్ దొరికితే బండ్ల ప‌వ‌న్ ను ఆకాశినికి ఎత్తేస్తుంటారు. 

ముఖ్యంగా గ‌బ్బ‌ర్ సింగ్, అజ్ఞాత‌వాసి సినిమాల ఫంక్ష‌న్ ల‌లో బండ్ల‌ గ‌ణేష్ స్పీచ్ లు వైర‌ల్ అయ్యాయి. కాగా తాజాగా వ‌కీల్ సాబ్ ప్రిరిలీజ్ ఈవెంట్ లోనూ బండ్ల గణేష్ రెచ్చిపోయారు. సినిమా గురించి మాట్లాడ‌న‌ని..ప‌వ‌న్ క‌ల్యాణ్ కు రికార్డులు...సినిమాలు కొత్త కాద‌ని అన్నారు. సినిమాలు ఆయ‌న  జీవితంలో ఒక భాగం మాత్ర‌మేన‌ని అన్నారు. అంతే కాకుండా బారీ డైలాగుల‌తో ఆవేశంతో ఊగిపోయారు. ఈశ్వ‌రా ప‌వ‌నేశ్వ‌రా అంటూ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా గొప్ప గొప్ప వాళ్ల‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ ను పోల్చారు. 

ఇక బండ్ల గ‌ణేష్ స్పీచ్ కు స్టేజ్ ద‌గ్గ‌ర ఉన్న ప‌వ‌న్, దిల్ రాజు తో పాటు మిగ‌తా సెల‌బ్రెటీలు కూడా తెగ న‌వ్వేశారు. ఇదిలా ఉండ‌గా ఇప్పుడు యూట్యూబ్ లో వ‌కీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లోని ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పీచ్ ట్రెండింగ్ లో నెంబ‌ర్ 1 స్థానంలో ఉంటే...బండ్ల గ‌ణేష్ స్పీచ్ నెంబర్ 2 స్థానంలో ఉంది. బండ్ల స్పీచ్ తో అంత క్రేజ్ సంపాధిచుంకున్నారు మ‌రి. 

More Related Stories