English   

అక్టోబర్ 1 నుంచి థియేటర్స్ ఓపెన్.. కరోనాను లైట్ తీసుకుంటున్నారా..

Cinema Halls
2020-09-27 11:48:41

సినిమా థియేటర్స్ దాదాపు ఆర్నెళ్లుగా మూసుకునే ఉన్నాయి. ఇప్పటి వరకు తెరవాలనే ఆలోచన కూడా చేయడం లేదు. తెరిచినా కూడా కేవలం 25 శాతం సీటింగ్ మాత్రమే నింపాలని ప్రభుత్వం ఆదేశించడంతో నిర్మాతలతో పాటు థియేటర్స్ యాజమాన్యం కూడా దీనికి సిద్ధంగా లేరు. అందుకే ఇప్పట్లో ఆ ఆలోచనలు కూడా మానుకోవడమే మంచిది అనుకున్నారంతా. జనవరి వరకు కూడా థియేటర్స్ అన్నీ క్లోజ్ చేసుకునే ఉంటాయని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి థియేటర్స్ ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నారు యాజమాన్యం. సినిమా హాళ్లతో పాటు ఓపెన్‌ ఎయిర్ థియేటర్లు కూడా ఓపెన్‌ కానున్నాయి. 

అంటే శివాజీ సినిమాలో ఓ సీన్ లో పార్క్ లో సినిమాలు చూస్తుంటారు కదా.. అలాంటివే ఓపెన్ థియేటర్స్ అంటే. 50 మంది అంతకంటే తక్కువ మందితో వీటిని నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. అయితే తెరిచిన తర్వాత కూడా అంతా కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని కోరింది ముఖ్యమంత్రి. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటివి పాటించి జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. అంతే కాదు వచ్చే నెల నుంచి మ్యూజిక్‌ షోలు, డ్యాన్సింగ్‌ ఈవెంట్స్‌, మ్యాజిక్‌ షోలకు కూడా అనుమతి ఇస్తామని సీఎం మమతా తెలిపారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్ లో కాస్త తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. 

More Related Stories