English   

మహేష్ బాబు సరికొత్త రికార్డ్.. దక్షిణాదిలో నెంబర్ 1

Mahesh Babu
2020-12-22 11:14:39

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌కు రికార్డుల క్రియేట్ చెయ్య‌డం, బ‌ద్ద‌లు కొట్టడం పెద్ద క‌ష్ట‌మేమి కాదు.  తాజాగా ప్రిన్స్ మహేష్ ట్విట్టర్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న దక్షిణాది హీరోగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ట్విట్టర్లో మహేష్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 11 మిలియన్ ప్లస్కు చేరింది. ఈ క్రమంలోనే ట్విటర్ లో మహేష్ బాబు 11 మిలియన్ల క్లబ్లోకి చేరాడు. దక్షిణాది హీరోల్లో 11 మిలియన్ల క్లబ్ లో చేరిన తొలిహీరో మహేష్ కావడం విశేషం. ఇప్పటికే మహేష్ కు ఇన్ స్ట్రాగమ్ లో 6.1 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా ఫేస్ బుక్ లో 5.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. టాలీవుడ్ లో ఎక్కువమంది ఫాలోవర్లున్న హీరోగా మహేష్ బాబు కొనసాగుతున్నారు. దీంతో #11millionmaheshians అన్న హ్యష్ ట్యాగ్ ను మహేష్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ట్విట్టర్ ఫేస్ బుక్ ఇన్ స్టాగ్రామ్ లలో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తన సినిమాలకు టూర్లకు సంబంధించిన అప్డేట్లను ఫ్యాన్స్ తో షేర్ చేస్తుంటాడు. తనతోపాటు నమ్రతా శిరోద్కర్ గౌతమ్ సితారలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు మహేష్.

More Related Stories