English   

ఆ థియేటర్ లో జనవరి 1నుండి ఫ్రీగా సినిమాలు

Free Movies
2020-12-30 15:05:42

ఓ థియేటర్ యజమాని దేశం కోసం సేవ చేస్తున్నవారికి ఏదైనా చేయాలని అనుకున్నారు. దాంతో పగలనక రాత్రనక కష్టపడుతున్న వారికి వినోదాన్ని పంచడం ద్వారా వారి కష్టం మరిచిపోవడానికి సహాయం చేసినవారం అవుతామని నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే తన థియేటర్ లో త్రివిధ దళాల్లో పనిచేస్తున్న వారికి తన హాల్లో 2021 జనవరి నుండి ఫ్రీ సినిమాలు అంటూ ప్రకటించేశారు. ఇంతకీ ఎవరా వ్యక్తి..ఎక్కుడుంది ఆ థియేటర్ అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. పాట్నాలో రెజెండ్ సినిమా థియేటర్ ఉంది. దాని యజమాని సుమన్ కె.సిన్హా. ఈయనకు దేశం అంటే ఎంతో గౌరవం. దాంతోనే సిన్హా దేశం కోసం సేవ చేస్తున్న వారికి ఫ్రీగా సినిమాలు చూపించి వినోదాన్ని పంచాలని నిర్ణయం తీసుకున్నాడు. దాంతో 2021 జనవరి నుండి ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ లో పని చేసే అధికారులు..ఉద్యోగులు తమ ఐడి కార్డు చూపించి సినిమా ఎంజాయ్ చేయచ్చు. ఈ సంధర్భంగా సిన్హా మాట్లాడుతూ...ఆర్మీ నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులకు ఫ్రీగా సినిమాలు చూపించడం ఆనందంగా ఉందన్నారు. అది తాను గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. రెజెండ్ థియేటర్ కు వచ్చి సినిమాలు చూడాలన్నారు.

More Related Stories