English   

గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 1న సుప్రీమ్ హీరో సాయితేజ్ ‘రిప‌బ్లిక్‌’

supreme-hero-sai-tejs-republic-to-release-on-october-1-for-gandhi-jayanti
2021-08-16 20:58:49

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌, దేవ్ క‌ట్టా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ `రిప‌బ్లిక్‌`. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలుతుది దశకు చేరుకున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్ష‌ణ న‌టులు జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, కాలేజ్ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సాయితేజ్ యాక్టింగ్‌, దేవ్ క‌ట్టా మార్క్ టేకింగ్ డైలాగ్స్‌తో సినిమాపై ఆసక్తి నెలకొంది. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌. కె.ఎల్‌.ప్ర‌వీణ్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

సాయితేజ్, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ‌, సుబ్బ‌రాజు, రాహుల్ రామ‌కృష్ణ‌, బాక్స‌ర్ దిన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత‌లు: జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు, జీస్టూడియోస్‌, జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, క‌థ‌, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: దేవ్ క‌ట్టా, స్క్రీన్‌ప్లే: దేవ క‌ట్ట‌, కిర‌ణ్ జ‌య్ కుమార్‌, సినిమాటోగ్ర‌ఫీ: ఎం.సుకుమార్‌, మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌, ఎడిట‌ర్‌: కె.ఎల్‌.ప్ర‌వీణ్

More Related Stories