English   

అక్టోబర్ 1న ‘సవ్యసాచి’..?

Savyasachi-teaser
2018-09-29 18:31:57

నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన సినిమా ‘సవ్యసాచి’. భూమిక ఓ కీలక పాత్రలో నటించింది. చైతూకు ప్రేమమ్ వంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. మొదట్లో మంచి ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ గా మొదలైన ఈ సినిమా తర్వాత యూ టర్న్ తీసుకుంది. ఓ దశలో పక్కన బెట్టారు అనే టాక్ కూడా వచ్చింది. నాగార్జునకు నచ్చలేదనో మరికొన్ని కారణాలేవో చెప్పారు.  అందుకే ఈ సినిమా డేట్స్ కూడా మార్చుకుని చైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’పై కాన్ సెంట్రేట్ చేశాడు. కానీ అల్లుడు కూడా అనుకున్నంత రిజల్ట్ ఇవ్వలేదు. దీంతో మళ్లీ చందు మొండేటి వైపు వచ్చాడు. ఈలోగా చందు కూడా కొన్ని మార్పులు  చేర్పులు చేశాడు. దీంతో రీ షూట్స్ స్టార్ట్ అయ్యాయి. అఫ్ కోర్స్ ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1న సవ్యసాచి టీజర్ విడుదల చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీపై మొదట్లో అంచనాలు బానే ఉన్నాయి. కానీ ఇప్పుడంత లేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక తమిళ స్టార మాధవన్ బ్యాడ్ బాయ్ గా నటిస్తున్నాడు. మాధవన్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ అంటున్నారు. మొత్తంగా ఒక మంచి సినిమాగా రావాల్సిన ఈ సినిమాను కావాలనే డీలే చేసి ఆడియన్స్ లో ఆసక్తి తగ్గేలా చేసుకున్నారు. ఇక అక్టోబర్ 1న టీజర్ విడుదల చేస్తే.. సినిమా కంటెంట్ ఏంటనేది తెలుస్తుంది. సినిమాను నవంబర్ లో విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. 

More Related Stories