English   

క్రిష్ బుడగ పేలడానికి 10 నిమిషాలు చాలట !

Manikarnika
2019-01-30 13:07:26

మణికర్ణిక సినిమాని దర్శకుడు క్రిష్ సగం వరకూ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే మణికర్ణిక చిత్రాన్ని తానే 70 శాతం తెరకెక్కించినట్లు కంగనా రనౌత్ ప్రచారం చేసుకోవడాన్ని తప్పుబట్టిన క్రిష్ ఆమె సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ అయ్యాక ఆయన ఓ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను మణికర్ణిక కోసం చాన్నాళ్ళు కష్టపడి పనిచేసి, సినిమాను పూర్తిచేసి బయటికి వచ్చానని స్పష్టం చేశారు. అలా సినిమా అంతా పూర్తిచేసి ఇచ్చిన తనను మీడియా మణికర్ణిక ప్రాజెక్ట్‌ను మధ్యలో ఎందుకు వదిలేశారని అడగడం చాలా బాధించిందని చెప్పారు. తాను దర్శకత్వం వహించిన సినిమాని చిన్న చిన్న మార్పులు చేసి ఆమె తెరకెక్కించినట్లు చెప్పడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే క్రిష్ వ్యాఖ్యల మీద కంగనా రనౌత్ అక్క రంగోళి నిన్న స్పందించారు. మొదట మణికర్ణిక క్రెడిట్ మొత్తం క్రిష్‌నే తీసుకోమనండి అంటూ ట్వీట్ చేసిన రంగోళి తరవాత తన చెల్లెలే 70 శాతం సినిమాను తెరకెక్కించిందని ట్వీట్ చేశారు. ఒక వేళ తన చెల్లెలు 70 శాతం సినిమాను తెరకెక్కించలేదని క్రిష్ నిరూపిస్తే క్షమాపణలు చెబుతుంది అంటూ ప్రకటించారు. మొదట డీఓపీ కిరణ్ డియోహన్స్, తరవాత డీఓపీ సచిన్ కె క్రిష్ణతో కలిసి కంగనా షూట్ చేసింది. ఎడిటర్ రామేశ్వర్‌ తో కలిసి సినిమాను 100 శాతం పూర్తిచేసిందని ఆమె పెర్కొనది. క్రిష్‌ను రామేశ్వర్ తన జీవితంలో ఒక్కసారి కూడా కలవలేదని రంగోళి  పేర్కొన్నారు. అలాగే అసలు ప్రస్తుత పోస్ట్ ప్రొడక్షన్ టీమ్‌ కు క్రిష్ ఎవరో కూడా తెలీదని, పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ మొత్తాన్ని కంగనానే ఎంపిక చేసిందని అలా కష్టపడి ఒంటి చేత్తో సినిమా తొలికాపీని కంగనా తన నిర్మాతకు అందించిందని ఆమె ట్వీట్ చేసింది. తొలికాపీ నిర్మాతకు నచ్చలేదని క్రిష్ గనుక నిరూపిస్తే కంగనా ఆయనకి క్షమాపణలు చెబుతుందని, చిత్రంలో తన పేరును తొలగిస్తుందని క్లాప్ బోర్డుల మొదలు టెక్నీషియన్ల వరకు ప్రతిదానికి రికార్డ్ ఉందని, దీనిపై క్రిష్ కంగారు పడాల్సిన అవసరం లేదని క్రిష్ బుడగ పేలిపోవడానికి 10 నిమిషాల సమయం చాలంటూ హెచ్చరించారు. మరి రంగోళి ట్వీట్ల పరంపర విషయంలో క్రిష్ స్పందిస్తారో లేదో చూడాలి. 

More Related Stories