English   

పవన్ కళ్యాణ్ 10 పాస్.. నామినేషన్ పేపర్లలో ఇంట్రెస్టింగ్ మ్యాటర్..

Pawan-kalyan
2019-03-22 05:13:13

గౌతం ssc అనే సినిమా మనకు తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ssc అనే మరో టైటిల్ కూడా వస్తుంది. అయితే ఏదో కొత్త సినిమాకి పెట్టిన టైటిల్ మాత్రం కాదు. పవన్ కళ్యాణ్ నిజ జీవితానికి సంబంధించిన సినిమా టైటిల్ ఇది. తాజాగా ఆయన నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు అఫిడవిట్ లో తన చదువు గురించి, క్వాలిఫికేషన్ గురించి రాశాడు. అందులో తాను పదో తరగతి వరకు మాత్రమే చదివినట్లు దాఖలు చేశాడు పవన్ కళ్యాణ్. 1984లో తన పదవ తరగతి పూర్తయిందని.. ఆ తర్వాత ఇంటర్ కానీ డిగ్రీ కానీ చేయలేదు అంటూ రాసుకొచ్చారు పవర్ స్టార్. ఇన్నిరోజులు పవన్ కళ్యాణ్ ఏం చదువుతున్నాడు అంటే ఇంటర్ వరకు చదువుకున్నాడు అంటూ సమాధానం వచ్చేది. కానీ తాను కాలేజీకి అసలు వెళ్లలేదని ఇప్పుడు ఆఫిడవిట్ చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది. నిజానికి ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ తన ప్రత్యేకతను చూపించాడు. కేవలం టెన్త్ క్లాస్ చదివినా కూడా ఆయన తెలివితేటలు మాత్రం అద్భుతం. ముఖ్యంగా పుస్తకాలు చదివిన నాలెడ్జ్ ఆయనలో కనిపిస్తుంది. అదే మిగిలిన వాళ్ళ అందరి కంటే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చేసి చూపిస్తుంది. సమాజం పట్ల పెరిగిన బాధ్యత కూడా ఈ పుస్తకాల వల్ల.. చిన్నప్పట్నుంచీ పెరిగిన వాతావరణం వల్ల వచ్చింది. చివరగా పదో తరగతి మాత్రమే చదివిన పవన్ కళ్యాణ్ ను హార్వర్డ్ యూనివర్సిటీ ప్రత్యేకంగా ఆహ్వానించింది అంటే ఆయన ప్రత్యేకత ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక మనిషి ఎదగాలంటే చదువుతో పని లేదని చెప్పడానికి పవన్ కళ్యాణ్ కూడా ఒక నిదర్శనం. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. మరి ఇక్కడ ఎలాంటి మార్పు తీసుకువస్తాడు అనేది చూడాలి.

More Related Stories