English   

సైరా 10 డేస్ కలెక్షన్స్.. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి హవా..

Sye Raa Narasimha Reddy
2019-10-11 12:50:27

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి 10 రోజుల కలెక్షన్స్ బయటికి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రప్ఫాడిస్తుంది. 10 రోజుల తర్వాత కూడా హవా తగ్గడం లేదు. పదో రోజు కూడా ఈ చిత్రం దాదాపు 3కోట్లకు పైగా షేర్ వసూలు చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పైగా హాలీడేస్ కూడా ఉండటంతో చిరుకు ఎదురు లేకుండా పోతుంది. దసరా సెలవులను టార్గెట్ చేసి విడుదల చేసాడు కాబట్టి సైరా వాటిని పక్కాగా వాడేసుకుంటుంది. 10 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 94 కోట్లు షేర్ వసూలు చేసింది సైరా. కానీ మిగిలిన చోట్ల మాత్రం చతికిలపడింది. అక్కడ పైకి లేచేలా కూడా కనిపించడం లేదు సైరా. ప్రపంచ వ్యాప్తంగా సైరా 10 రోజుల్లో దాదాపు 126 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రభాస్ సినిమాల తర్వాత తెలుగులో రికార్డ్ ఇదే. తెలుగుతో పాటు కన్నడలో కూడా అదరగొడుతుంది సైరా. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 10 రోజుల్లో 94 కోట్లకి పైగా షేర్ వసూలు చేసింది. మరో 11 కోట్లు వెనక బడే ఉంది సైరా. దసరా సెలవులు మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో అసలు పరిస్థితి ముందుంది. అయితే తెలంగాణలో ఆర్టీసి సమ్మె కారణంగా మరో మూడురోజులు సెలవులు వచ్చేలా కనిపిస్తున్నాయి. దాంతో చిరంజీవికి ఇది కూడా హెల్ప్ కానుంది. మొత్తానికి సైరా వసూళ్ల ప్రభంజనం తెలుగులో మాత్రం కొనసాగుతూనే ఉంది

More Related Stories