English   

చిరంజీవి ఇంట్లో మెగాపార్టీ.. 10వ సారి రీ యూనియన్ పార్టీ..

chiru
2019-11-24 20:19:37

80ల్లో ఉన్న స్టార్స్ అంతా ఏటేటా కలుసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా ఇలాంటి పార్టీ జరుగుతుంది. అయితే ఈ సారి చిరంజీవి ఇంట్లోనే ఈ పార్టీ జరగబోతుంది. దానికి చాలా మంది ప్రముఖులు వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యే కొత్త ఇంట్లోకి వెళ్లాడు. అక్కడే ఈ పార్టీ జరుగుతుంది. ఇప్పటి వరకు గత 9 ఏళ్లుగా రకరకాల చోట్ల ఈ మీటింగ్ జరుగుతూ వస్తుంది. ఇప్పుడు చిరంజీవి హోస్ట్ చేస్తున్నాడు. ఈ సారి ప‌దో వార్షికోత్స‌వ దినోత్సవం కావడంతో పార్టీ గ్రాండ్ గా ప్లాన్ చేసాడు మెగాస్టార్. ఈ ఏడాది తానే ఇస్తానని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఈ కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేసాడు.

తన సైరా సినిమా విజయోత్సవాన్ని కూడా 80ల్లోని తారలతో కలిసి సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. ఆయ‌నే హోస్టింగ్ చేయ‌డం మరింత ఆస‌క్తిక‌రంగా మారింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో నిర్వ‌హించారు. ఈ రీయూనియ‌న్ మీట్ లో ఈసారి 1980-1990లో అగ్ర తార‌లు పాల్గొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ స‌హా మ‌ల‌యాళం.. క‌న్న‌డం నుంచి మొత్తం 40 మంది తార‌లు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. గ‌త తొమ్మిదేళ్లుగా ఈ వేడుక‌లు విజ‌య‌వంతంగా జ‌రుగుతున్నాయి.

 

More Related Stories