English   

వెంకీ మామ కలెక్షన్స్.. మరో 10కోట్లు రావాలి

Venky Mama
2019-12-17 16:39:16

వెంకీ మామ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తున్నాడు. మామా అల్లుళ్లు కలిసి మంచి కలెక్షన్లు వసూలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా మంచి సినిమా ఏది రాకపోవడంతో వచ్చిన సినిమానే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. నిజానికి వెంకీ మామ గొప్ప సినిమా కాదు.. అందులో కూడా రొటీన్ స్టోరీ ఉంది. ఎప్పుడో 1990ల నుంచి చూస్తున్న మామా అల్లుళ్ల కథ. తెలిసిన కథే అయినా కూడా ఎమోషన్స్ బాగా పడటంతో వెంకీమామ వైపు ప్రేక్షకులు అడుగులు పడుతున్నాయి. తొలిరోజు 7 కోట్ల వరకు వసూలు చేసిన ఈ సినిమా తర్వాత రెండు రోజుల్లో మరో 10 కోట్ల పైగా వసూలు చేసింది. ఇప్పటివరకు వెంకీ మామ 5 రోజుల్లో దాదాపు 24 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా సేఫ్ కావాలంటే 36 కోట్లు తీసుకురావాలి. ఎంత చేసినా ఎన్ని తీసుకొచ్చిన డిసెంబర్ 19 వరకే వెంకీ మామకు అవకాశం ఉంది. డిసెంబర్ 20న 4 సినిమాలు విడుదలవుతున్నాయి. దాంతో ఈ శుక్రవారం నుంచి వెంకటేష్ సినిమాకు వసూలు కచ్చితంగా తగ్గుతాయి. దాంతో దానికి ముందు ఎంత వీలైతే అంత వసూలు చేయడానికి మ్యాగ్జిమం ప్రయత్నిస్తున్నారు. కె ఎస్ బాబీ తెరకెక్కించిన ఈ చిత్రంపై ముందు నుంచి కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. అదే సినిమాకు కలెక్షన్లు తెచ్చిపెడుతుంది. దానికి తోడు పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా అందాల ఆరబోత కూడా వెంకీ మామకు ప్లస్ అయ్యింది. ఎటు చూసుకున్న కూడా ప్రస్తుతానికి వెంకీ మామ పరిస్థితి బాగానే ఉన్నా రెండో వారంలో కూడా కలెక్షన్లు తీసుకువస్తేనే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళుతుంది.

More Related Stories