English   

జనవరి 10 అంటే భయపడుతున్న మహేష్ బాబు, అల్లు అర్జున్..

mahe
2020-01-04 06:27:41

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఖాయంగా ఉంటాయి. బలంగా కూడా ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతికి కూడా ఇదే సెంటిమెంట్ పని చేస్తుంది. మహేష్ బాబు, అల్లు అర్జున్ తమ సినిమాలను సంక్రాంతికి విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. అయితే డేట్ మాత్రం ఇంకా ఖాయం చేసుకోలేదు. జనవరి 11, 12 అని ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. అంటే శనివారం.. ఆదివారం అన్నమాట. మన దగ్గర శని, ఆదివారం సినిమాలు రిలీజ్ చేయడం అనేది దాదాపు అసాధ్యం. కానీ ఇప్పుడు మన హీరోలు ఇదే చేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా కారణాలు కూడా లేకపోలేదు. జనవరి 10న విడుదల చేస్తే సినిమా ఫ్లాప్ అవుతుందని ఒక నమ్మకం, సెంటిమెంట్ ఇండస్ట్రీలో బలంగా పడిపోయాయి. రెండేళ్ల కింద విడుదలైన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి.. 5 ఏళ్ల కిందట విడుదలైన మహేష్ బాబు నేనొక్కడినే..

2019లో వచ్చిన పేట సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దాంతో జనవరి 10 అంటే భయపడుతున్నారు మన దర్శక నిర్మాతలు. కానీ స్టార్ హీరోల సినిమాలకు ఇంత చిన్న సెంటిమెంట్లు పెట్టుకోవడం మంచిది కాదు అంటున్నారు విశ్లేషకులు. జనవరి 10న విడుదల చేస్తే శుక్రవారం అవుతుంది.. సినిమా ఎలా ఉన్నా తొలిరోజు కలెక్షన్ల కుంభవృష్టి కురిపించడం ఖాయం. ఆ తర్వాత శనివారం కూడా ఫుల్స్ పడతాయి. అక్కడ నుంచి సంక్రాంతి సీజన్ మొదలవుతుంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా జనవరి 12న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు మహేష్ బాబు, అల్లు అర్జున్. ఇది ఏమాత్రం సరైనది కాదు అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు కూడా. సినిమా బాగుంటే సెంటిమెంట్లు పనిచేయవని ఇదివరకు చాలా సార్లు ప్రూవ్ అయింది. కానీ ఇప్పుడు మహేష్, బన్నీ మాత్రం పంతానికి వెళ్లి ఒకే రోజు తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. మరి చివరికి ఈ యుద్ధం ఎక్కడ ముగుస్తుందో చూడాలి.

More Related Stories