English   

ప్రభాస్ సినిమాలో 10 మంది బాలీవుడ్ స్టార్స్

 Prabhas
2021-05-29 20:08:44

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆదిపురుష్‌, స‌లార్ సినిమాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. అంతే కాకుండా రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌య్యింది. ఇదిలా ఉండ‌గా ప్ర‌భాస్ నాగ్ అశ్విన్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమాకు ఒప్పుడుకున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు. అంతే కాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకునే హీరోయిన్ గా న‌టిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కూడా ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 

అయితే తాజాగా ఈ సినిమాపై మ‌రో ఆస‌క్తిక‌ర వార్త ఫిల్మ్ న‌గ‌ర్ లో చక్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాలో అమితాబ్ దీపికా స‌హా మొత్తం ప‌ది మంది బాలీవుడ్ స్టార్ లు న‌టించబోతున్నార‌ట‌. కీల‌క పాత్ర‌ల్లో వారు న‌టించ‌బోతున్నార‌ని స‌మాచారం. అంతే కాకుండా ఇప్ప‌టికే విల‌న్ పాత్ర‌కోసం ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడిని సంప్ర‌దించిన‌ట్టు కూడా టాక్. అయితే ఇందులో ఎంత‌వ‌ర‌కూ నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాను సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్న‌ట్టు ఇప్ప‌టికే నాగ్ అశ్విన్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. అంతే కాకుండా ఈ సినిమా కోసం భారీ వీఎఫ్ఎక్స్ ను వినియోగిస్తామ‌ని అన్నారు. 

More Related Stories