English   

ప్రియాంక పెళ్లికూతురు ఖ‌ర్చు 10 కోట్లు.. 

Priyanka-Chopra
2018-10-31 18:13:26

పెళ్లికూతురు చేయ‌డం అంటే మ‌న ఇళ్ల‌లో నార్మ‌ల్ గా ఒక‌రోజు ముందో.. రెండు రోజుల ముందో చేస్తారు. కానీ అక్క‌డున్న‌ది స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా క‌దా. మ‌రి ఆమె పెళ్లి కూడా అంద‌రిలా జ‌రిగితే ఏం బాగుంటుంది చెప్పండి..? అందుకే నెల రోజుల ముందే ఈమె పెళ్లికూతురు అయిపోయింది. డిసెంబ‌ర్ లో ప్రియుడు నిక్ ను పెళ్లి చేసుకోనున్న ప్రియాంక‌.. ఇన్ని రోజుల ముందే పెళ్లికూతురు అయిపోయింది. ముఖ్యంగా ఈ వేడుక‌లో ఈమె న‌గ‌లే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాయి. ఎందుకంటే ఈ ఈవెంట్‌లో ఆమె పెట్టుకున్న నగలు దాదాపు 7.5 కోట్లకు పైగానే ఉంటాయ‌ని తెలుస్తుంది. 

ఈమె ధ‌రించిన జ్యూయెల‌రీ పేరు కూడా టిఫానీ అండ్ కో. ప్రియుడు ఫారెన్ నుంచి ఇవి తెప్పించాడ‌ని తెలుస్తుంది. పైగా ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ నిక్ జొనాస్ 2.10 కోట్ల విలువైన ఎంగేజ్‌మెంట్ రింగ్ తో కలిసి ఈ ఈవెంట్ కోసం ప్రియాంక పెట్టుకున్న న‌గల విలువ 10 కోట్లకు చేరిపోయింది. ప్ర‌స్తుతానికి ఈ పెళ్లికూతురు తంతు ముగిసినా డిసెంబ‌ర్ లో జోధ్ పూర్ లోని ఓ బంగళాలో మూడు రోజుల పాటు ప్రియాంక చోప్రా పెళ్లి జ‌ర‌గ‌నుంది. దీనికి అతి త‌క్కువ మంది హాజ‌రు కానున్నారు. పెళ్లి త‌ర్వాత రిసెప్ష‌న్ గ్రాండ్ గా ముంబైలో జ‌ర‌గ‌నుంది. మొత్తానికి ప్రియాంక పెళ్లి చేసుకుంటున్న‌ది ఫారెన‌ర్ ను అయినా.. ప‌ద్దతులు మాత్రం అన్నీ ఇండియ‌న్ ప్ర‌కారమే జ‌రుగుతున్నాయి.

More Related Stories