English   

ఒకే ఒక్క‌పాట‌.. ఇంకేం కావాలి..?

Inkem-Kavale-Song
2018-07-19 09:44:08

ఒక్క పాట‌తో సినిమాపై అంచ‌నాలు పెరిగిపోతాయా..? ఒక్క‌పాట‌తో అంద‌రి దృష్టి ఆ సినిమాపై ప‌డుతుందా..? ప‌డుతుంది.. ఒప్పుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఇప్పుడు. ఆ మ‌ధ్య కృష్ణార్జున యుద్ధంలో దారిచూడు దుమ్ముచూడు.. ఛ‌లోలో చూసి చూడంగానే త‌ర‌హాలోనే ఇప్పుడు ఇంకేం కావాలి పాట యూ ట్యూబ్ ను షేక్ చేస్తుంది. గీతాగోవిందం సినిమాలోని ఈ పాట ఇప్పుడు వైర‌ల్ గా మారిపోయింది. అనంత శ్రీ‌రామ్ రాసిన ఈ పాట‌కు గోపీసుంద‌ర్ త‌న‌దైన శైలిలో ట్యూన్ ఇచ్చాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరో కావ‌డం.. ఛ‌లోతో కుర్రాళ్ల‌ మ‌తులు చెడ‌గొట్టిన క్యూట్ బేబీ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ కావ‌డంతో గీత‌గోవిందంపై అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. వాటికి తోడు ఇప్పుడు విడుద‌లైన పాట అయితే సినిమాను మ‌రో రేంజ్ కు తీసుకెళ్లిపోయింది. గీతాఆర్ట్స్ నిర్మాణం కావ‌డంతో సినిమాపై ఆస‌క్తి పెరిగిపోతుంది. పైగా శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు త‌ర్వాత ప‌రుశురామ్ చేస్తోన్న సినిమా.. ఛ‌లో బ్యూటీ ర‌ష్మిక హీరోయిన్.. ఇవ‌న్నీ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాయి. నాలుగు రోజుల కింద విడుద‌లైన ఇంకేం కావాలి పాట‌కు యూట్యూబ్ లో కోటి వ్యూస్ వ‌చ్చాయి. విజ‌య్ లాంటి కుర్ర హీరోకు ఇంత‌గా క్రేజ్ ఉండ‌టం మాత్రం ఇప్పుడు నిజంగా అంద‌రికీ షాకే. ఈ మ‌ధ్య రొటీన్ మ్యూజిక్ తో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న గోపీసుంద‌ర్.. గీతగోవిందంతో ఫామ్ లోకి వ‌చ్చేసాడు. అనంత శ్రీ‌రామ్ లిరిక్స్ కు తోడు సిధ్ శ్రీ‌రామ్ వాయిస్ కూడా ఈ పాట‌కు బ‌లం. ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది ఈ చిత్రం. మ‌రి పాట‌తోనే ఇంత‌గా ర‌చ్చ చేసిన గీత‌గోవిందం.. సినిమా విడుద‌లైన త‌ర్వాత ఏం చేస్తారో..? 

More Related Stories